Autonomous Status : జిల్లాలో స్వయం ప్రతిపత్తి హోదాను పొందిన తొలి కళాశాల..
యలమంచిలి రూరల్: యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అటానమస్ స్టేటస్ (స్వయం ప్రతిపత్తి హోదా) ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ చంద్రశేఖర్ గురువారం మీడియాకు తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్య, సౌకర్యాల కల్పనకు అప్పటి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. దీంతో ఈ కళాశాలకు నాక్ ఏ గ్రేడు లభించింది. అదే క్రమంలో కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదానిస్తూ గత ఏడాది నవంబరు 13న యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది.
Sports Schools: స్పోర్ట్స్ స్కూల్‌లో ఏడుగురికి కొత్తగా పోస్టింగ్
2024–25 విద్యా సంవత్సరం నుంచి పదేళ్లు అంటే 2033–34 వరకు అటానమస్ హోదా కొనసాగుతుంది. దీంతో ఈ సంవత్సరం నుంచి దీనిని అమలు చేయడానికి వీలుగా కళాశాల అధికారులు చర్యలు ప్రారంభించారు. స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న విద్యాసంస్థలకు.. సిలబస్, ప్రశ్నపత్రాలు రూపొందించుకుని, జవాబు పత్రాల మూల్యాంకనం చేసి, సర్టిఫికెట్లు జారీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం తాత్కాలికంగా ఇచ్చిన అటానమస్ హోదా ప్రకారం నిబంధనలు పాటించి నాణ్యమైన విద్యనందిస్తే మరోసారి హోదా పెంచడం కానీ, శాశ్వతంగా అటానమస్ హోదా ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అటానమస్ హోదా అమలు చేయడానికి ముందుగా అవసరమైన సిలబస్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు.
Navodaya Vidyalaya : నవోదయ విద్యాలయలో చేరితే బంగారు భవిష్యత్తు.. ప్రవేశానికి మాత్రం!
ఇతర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన సీనియర్, విశ్రాంత అధ్యాపకులు, ఆచార్యుల సలహాలు, సూచనలతో సిలబస్‌ను రూపొందిస్తున్నామని, దశలవారీగా స్వయంప్రతిపత్తి హోదాను పకడ్బందీగా అమలు చేస్తామని, ఈ ప్రాంత విద్యార్థులు దీనిని సద్వినియోగపర్చుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నత విద్యలో చేపట్టిన సంస్కరణల ఫలితంగానే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉన్న యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా వచ్చిందని స్థానిక విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు.
Spot Admissions: ఈనెల 31న పాలిటెక్నిక్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు