STEM Programs : స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌తో విస్తృత అవకాశాలు.. అంతర్జాతీయంగా స్టెమ్‌ నిపుణులకు డిమాండ్‌!

స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌ అనే మాట గత దశాబ్ద కాలంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌ అంటే.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ కోర్సులు!!

ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో.. పరిశ్రమల అవసరాలు, ఉద్యోగార్థులకు అవకాశాల పరంగా టాప్‌–5లో నిలుస్తున్న ప్రోగ్రామ్స్‌!! ఈ నాలుగు విభాగాల్లో.. వేటిలో పట్టా పొందినా, ఎందులో నైపుణ్యం సొంతం చేసుకున్నా.. దేశ విదేశాల్లో ఉద్యోగాలకు కొదవలేదు. ఆర్‌ అండ్‌ డీలోనూ.. స్టెమ్‌ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. స్టెమ్‌ ప్రోగ్రామ్స్, వాటి ప్రత్యేకత, ప్రయోజనాలు, కెరీర్‌ అవకాశాలు, అకడమిక్‌ మార్గాలు తదితర వివరాలు..

ఏఐ టెక్నాలజీ అయినా.. ఓపెన్‌ ఏఐ అయినా.. వాటిని కార్యరూపంలోకి తేవాలంటే.. తెరవెనుక సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ నిపుణుల పాత్ర ఎంతో కీలకం. అందుకే ఇప్పుడు ఈ విభాగాల్లో నైపుణ్యం సొంతం చేసుకున్న వారికి అంతర్జాతీయంగా అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌..

IDBI Bank Jobs : ఐడీబీఐ బ్యాంక్‌లో 600 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

ఈ నాలుగు విభాగాలను కలిపి సంక్షిప్తంగా స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌గా పిలుస్తున్నారు. ఇందుకు కారణం.. ఈ విభాగంలో పేర్కొన్న నాలుగు కోర్సులు ఒకదానికొకటి అనుసంధానంగా ఉండటమే. లేటెస్ట్‌ టెక్నాలజీస్‌ను రూపొందించే క్రమంలో.. సైన్స్, మ్యాథమెటిక్స్‌ సూత్రాలను అన్వయించాల్సి ఉంటుంది. ఇదే విధంగా ఇంజనీరింగ్‌కు మూలం సైన్స్, మ్యాథ్స్‌ సిద్ధాంతాలే.

నిపుణుల కొరత

ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్టెమ్‌ నిపుణుల కొరత కనిపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా మొదలు యూకే, కెనడా, జర్మనీ, చైనా, భారత్‌.. ఇలా అన్ని దేశాల్లోనూ స్టెమ్‌ నిపుణుల కోసం ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు సంస్థలు అన్వేషణ సాగిస్తున్నాయి. కొత్త పరిశోధనలు, సాంకేతికతల ద్వారా నూతన ఆవిష్కరణల దిశగా స్టెమ్‌ నిపుణుల అవసరం పెరుగుతోంది. స్టెమ్‌ నిపుణుల డిమాండ్, సప్లయ్‌ మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. రీసెర్చ్‌కు కేరాఫ్‌గా భావించే జర్మనీలో, అదే విధంగా అమెరికాలో, యూకేలో.. స్టెమ్‌ నిపుణులకు డిమాండ్‌ నెలకొంది.

IITH: వెంట్రుకలో వెయ్యో వంతునూ చూడొచ్చు!

సైన్స్, మ్యాథమెటిక్స్‌

స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌లోని నాలుగు విభాగాల్లోఎక్కువ మంది టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ వైపే దృష్టి సారిస్తున్నారు. విద్యార్థుల్లో అధిక శాతం ఉన్నత విద్య, ఉపాధి కోసం ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో చేరుతున్నారు. దీంతో ప్యూర్‌ సైన్సెస్, మ్యాథమెటిక్స్‌లో అడుగు పెట్టే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. వాస్తవానికి సైన్స్, మ్యాథమెటిక్స్‌ల్లోనే ఎక్కువగా నిపుణుల కొరత నెలకొన్నట్లు పలు అంచనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీలుగా పేర్కొంటున్న ఏఐ, బిగ్‌ డేటా, ఐఓటీ వంటి విభాగాల్లో ఈ నిపుణుల కొరత దాదాపు 40 శాతం మేరకు నెలకొంది.

పెరుగుతున్న ఆసక్తి

స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌పై విద్యార్థుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. మన దేశంలో గత మూడేళ్లుగా.. స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌లో చేరే వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే.. స్టెమ్‌ ప్రోగ్రా­మ్స్‌ అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉంది. సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో రీసెర్చ్‌ అభ్యర్థులకు పలు ప్రోత్సాహకాలు అందించడం ఇందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. దీంతోపాటు ఈ కోర్సులను పూర్తి చేసుకుంటే.. అధిక వేతనాలతో కెరీర్‌ అవకాశాలు లభిస్తాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది వీటిల్లో చేరుతున్నారు. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ప్రోత్సాహకాలు

దేశంలో సైన్స్, మ్యాథమెటిక్స్‌లో నిపుణులను తీర్చిదిద్దాలని, తద్వారా పరిశోధనలు, ఆవిష్కరణలు పెంచాలనే ఉద్దేశంతో పలు చర్యలు చేపడుతున్నారు. హైస్కూల్‌ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకూ.. సైన్స్, మ్యాథమెటిక్స్‌ విద్యార్థులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఫీజులు, ఇతర అకడమిక్‌ ఖర్చుల కోణంలో రాయితీలు అందిస్తున్నారు. ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్పులు లభిస్తున్నాయి. యూనివర్సిటీ స్థాయిలో ఇటీవల పీహెచ్‌డీలో చేరే విద్యార్థులకు ప్రభుత్వం ఫెలోషిప్‌లను పెంచింది. వీటన్నింటి ఫలితంగా ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్స్‌లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 

ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్స్‌

స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌ నిపుణులకు ఉన్నత స్థాయిలో ప్రత్యేక నైపుణ్యాలు అందించేందుకు కేంద్ర ప్రభు­త్వం ప్రత్యేకంగా ఐఐఎస్‌ఈఆర్‌(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) పేరుతో ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్స్‌ను నెలకొల్పింది. వీటితోపాటు స్థానిక యూనివర్సిటీలు, సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఐఐటీల్లో సైన్స్, మ్యాథమెటిక్స్‌ మేజర్స్‌గా ప్రత్యేక కోర్సులను అందిస్తున్నారు. 

Scholarship : సీబీఎస్ఈ సింగ‌ల్ గ‌ర్ల్ చైల్డ్ స్కాల‌ర్‌షిప్‌ 2024.. అర్హ‌త వీరికే..

డేటా సైన్స్, డేటా అనలిటిక్స్‌

దేశంలోని పలు మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి. ముఖ్యంగా డేటా సైన్స్, డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. కార్పొరేట్‌ ప్రపంచంలో డేటా సైన్స్, డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం పెరగడమే ఇందుకు కారణం. అనలిటిక్స్‌లో నైపుణ్యానికి టెక్‌ స్కిల్స్‌ పునాదిగా నిలుస్తున్నాయి.

Intermediate Exam Fees: ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే..

ఈ అనలిటిక్స్‌ ఆధారంగా వ్యాపార వ్యూహాలు రూపొందించడానికి మేనేజ్‌మెంట్‌ నిపుణుల అవసరం నెలకొంది. దీంతో మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకే డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్‌ వంటి నైపుణ్యాలను బోధిస్తే.. రెండు రకాల నైపుణ్యాలు సొంతమై కార్పొరేట్‌ ఆఫర్లు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ కోర్సుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌లకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. 

విస్తృత నైపుణ్యాలు

స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌ పూర్తి చేసుకుంటే.. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్, అనలిటికల్‌ నైపుణ్యాలు, రీసెర్చ్‌ ఓరియెంటేషన్‌ స్కిల్స్‌ సొంతమవుతాయి. వీటి ఫలితంగా విద్యార్థులు ఆయా విభాగాల్లో భవిష్యత్తులో విధుల నిర్వహణపరంగా మెరుగైన పనితీరు కనబరుస్తారని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. 

ఉపాధి అవకాశాలు

స్టెమ్‌ గ్రాడ్యుయేట్స్‌కు ప్రస్తుతం అన్ని విభాగాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఆర్‌ అండ్‌ డీ, మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థలు, బయో మెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్, హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్స్, ఐటీ సంస్థలు.. ఇలా పదుల సంఖ్యలో ఆయా రంగాల్లోని కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, రోబోటిక్స్, ఐఓటీ తదితర విభాగాల్లో ప్రోగ్రామర్స్‌కు ఆఫర్స్‌ లభిస్తున్నాయి.

SBI Jobs : ఎస్‌బీఐ బ్యాంక్‌లో 169 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఆకర్షణీయ వేతనాలు

స్టెమ్‌ ప్రోగ్రామ్‌ నిపుణులకు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఉన్న వారికి సగటున నెలకు రూ.30 వేల వేతనం అందుతోంది. పీజీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు వారి స్పెషలైజేషన్‌కు అనుగుణంగా..నెలకు రూ.50 వేల వేతనం లభిస్తోంది. పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ.లక్ష వరకు వేతనం ఇవ్వడానికి సైతం సంస్థలు సిద్ధంగా ఉంటున్నాయి.

అకడమిక్‌ మార్గాలు ఇవే

మ్యాథమెటిక్స్, సైన్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌ల్లో చేరే వీలుంది. అదేవిధంగా ఇంజనీరింగ్, టెక్నాలజీలో చేరాలనుకునే వారికి బీఈ/బీటెక్‌ కోర్సులను ఆయా ఇన్‌స్టిట్యూట్స్‌ అందిస్తున్నాయి. వీటితోపాటు సీయూఈటీ–యూజీ, పీజీ ఎంట్రన్స్‌లలో ఉత్తీర్ణత ఆధారంగా.. మ్యాథమెటిక్స్, సైన్స్‌కు సంబంధించి ప్రతిష్టాత్మక సెంట్రల్‌ యూనివర్సిటీల్లో అడుగు పెట్టొచ్చు. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, గేట్, జామ్‌ తదితర ఎంట్రెన్స్‌లలో ప్రతిభ చూపడం ద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్టాత్మక టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ తోపాటు మరెన్నో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశించొచ్చు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

ఆసక్తి ప్రధానం

స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌లో రాణించాలంటే.. సంబంధిత సబ్జెక్ట్‌లపై ఆసక్తి ప్రధానమని నిపుణులు పేర్కొంటున్నారు. జాబ్‌ మార్కెట్‌ ఉద్దేశంతో కాకుండా సబ్జెక్టులపై ఆసక్తి పెంచుకొని స్టెమ్‌ కోర్సులను అధ్యయనం చేయాలని సూచిస్తున్నారు. అనలిటికల్‌ స్కిల్స్, అప్లికేషన్‌ స్కిల్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు పెంచుకోవాలని పేర్కొంటున్నారు. సబ్జెక్ట్‌లను విశ్లేషిస్తూ.. ఆయా అంశాలపై వాస్తవ పరిస్థితులను అన్వయం చేస్తూ ప్రాక్టీస్‌తో కూడిన అభ్యసనం చేయాలి. అప్పుడే చక్కటి నైపుణ్యాలు లభిస్తాయి. ఫలితంగా మెరుగైన కెరీర్‌ అవకాశాలు సొంతమవుతాయి. 

#Tags