UGC Aims To Train 5000 Employees: సెంట్రల్‌ యూనివర్సిటీలోని నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి యూజీసీ శిక్షణ

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ),కెపాసిటీ బిల్డింగ్ కమీషన్ భాగస్వామ్యంతో.. 45 సెంట్రల్‌ యూనివర్సిటీల్లోని నాన్‌ టీచింగ్‌ సభ్యులకు కెపాసిటీ బిల్డింగ్‌ ట్రైనింగ్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో మొదటి దశలో అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీల నుంచి సుమారు 5వేల మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు యూజీసీ చీఫ్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్  తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూజీసీ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి వారి నైపుణ్యాలు, సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు ఈ శిక్షణ కార్యక్రమం తోడ్పడుతుందన్నారు. ''వర్క్‌ఫ్లో సైకాలజీని అర్థం చేసుకోవడం, పనిలో టెక్నాలజీని ఉపయోగించడం, ఆర్థిక, ప్రాజెక్ట్‌ నిర్వహణ వంటి పలు అంశాలను ట్రైనింగ్‌ సెషన్‌లో కవర్‌ చేస్తారు.

కమిషన్‌ ముఖ్య ఉద్దేశమిదే..
మిషన్ కర్మయోగి'లో భాగంగా ఉద్యోగుల నైపుణ్యాలను మరింత మెరుగుపర్చడంపై కమిషన్‌ దృష్టి సారిస్తుంది. మారుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా,ఉన్నత విద్యలో ఆవిష్కరణలను పెంపొందించడమే కెపాసిటీ బిల్డింగ్‌ ముఖ్య ఉద్దేశం.

అక్టోబర్ 2023 నుండి ఇప్పటి వరకు, ఈ కార్యక్రమంలో భాగంగా 635 మందికి పైగా UGC ఉద్యోగులు 5480 కోర్సులను పూర్తి చేసారు. ట్రైనింగ్‌ అనంతరం వారికి సర్టిఫికేట్లను అందిస్తారు'' అని ఆయన వెల్లడించారు. 
 

#Tags