Two Days Schools Holidays 2024 : బ్రేకింగ్ న్యూస్.. రెండు రోజుల పాటు స్కూల్స్ బంద్
బీహార్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో పలు నగరాల్లో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా వాన దంచి కొడుతోంది. రోడ్లన్నీ నదులు మాదిరిగా మారాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. అన్ని ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
Job Mela: ఈనెల 31న జాబ్‌మేళా.. వీళ్లు అర్హులు
బీహార్‌లో భాగల్‌పూర్, ముంగేర్, పశ్చిమ చంపారన్, ఖగారియా, కతిహార్, మరికొన్ని జిల్లాల్లో వరదల కారణంగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొన్ని ప్రాంతాల్లో 24 గంటల పాటు అలర్ట్ ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాలతో రహదారులు నీట మునిగాయి. ఇలాంటి పరిస్థితిలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
Closed Telangana Anganwadi Centers: మూతపడిన తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాలు
వరద ప్రభావిత గ్రామీణ ప్రాంతాల్లోని 76 ప్రభుత్వ పాఠశాలను ఆగస్టు 31 వరకు మూసివేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.