National Urdu Seminar : రెండు రోజుల జాతీయ ఉర్దూ సెమినార్‌..

శని, ఆదివారాల్లో జాతీయ ఉర్దూ సెమినార్‌ ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ మహిళ డిగ్రీ కళాశాలలో జరుగుతుందని జాతీయ సెమినార్‌ చైర్మన్‌ సత్తార్‌ ఫైజీ తెలిపారు.

కడప ఎడ్యుకేషన్‌: కడప నగరంలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ మహిళ డిగ్రీ కళాశాలలో శని, ఆదివారాల్లో జాతీయ ఉర్దూ సెమినార్‌ జరుగుతుందని జాతీయ సెమినార్‌ చైర్మన్‌ సత్తార్‌ ఫైజీ, అంజుమన్‌ తరఖి ఉర్దూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ అబ్దుల్‌ సత్తార్‌ సాహిర్‌, సయ్యద్‌ హిదాయతుల్లా తెలిపారు. ఈ జాతీయ ఉర్దూ సెమినార్‌కు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారని వారు తెలిపారు.

AAPAR Card : అపార్ కోసం స్కూల్ రికార్డు మార్చ‌డం స‌రికాదు!

ఇందులో భాగంగా 9వ తేదీ ఉదయం ప్రజా ప్రతినిధులతో ప్రారంభ సభ, మధ్యాహ్నం ఉర్దూ భాషాభివృద్ధిలో ప్రభుత్వ పాత్ర, సాయంత్రం సెషన్‌లో ఉర్దూ భాషాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర, రాత్రి జాతీయ కవి సమ్మేళనం ఉంటుందని తెలిపారు. అలాగే 10 వ తేదీ ఉదయం ఉర్దూ భాషాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర, మధ్యాహ్నం ఉర్దూ భాషాభివృద్ధిలో ఉర్దూ సంఘాల పాత్ర, సావనీర్‌, వివిధ రచయితల పుస్తకాల ఆవిష్కరణ, పరిశోధన పత్రాల సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలోని అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కవులు రచయితలు, భాషా పరిశోధకులు, ఉర్దూ భాషాభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags