TS Best Available School Scheme Admission: పేద విద్యార్థులకు ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచితంగా అడ్మీషన్‌.. వీళ్లు అర్హులు

కౌటాల(సిర్పూర్‌): ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు ప్రైవేట్‌ స్కూళ్లలో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం బెస్ట్‌ అవైలబుల్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో 2024– 25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశా ల కోసం అర్హుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

కాగజ్‌నగర్‌ పట్టణంలోని విశ్వశాంతి హైస్కూ ల్‌, కౌటాలలోని మయూరి విద్యాలయం బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆ యా పాఠశాలల్లో ఐదో తరగతి(రెసిడెన్షియల్‌)లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2023– 24 వి ద్యా సంవత్సరంలో నాలుగో తరగతి పూర్తయిన వి ద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశాల కోసం దరఖా స్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటో తరగతిలో నాన్‌ రెసిడెన్షియల్‌ కింద 38 సీట్లు కేటాయించారు.

TS Inter Supplementary Exam 2024: నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

లక్కీడ్రా పద్ధతిలో ఎంపిక
అర్హులైన విద్యార్థులు అన్ని ధ్రువీకరణ పత్రాలను జత చేసి జూన్‌ 7లోగా జిల్లా కార్యాలయంలో సమర్పించాలి. అనంతరం కలెక్టరేట్‌లో లక్కీడ్రా పద్ధతి లో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికై న వారికి కాగజ్‌నగర్‌ పట్టణంలోని విశ్వశాంతి హైస్కూల్‌, కౌటాలలోని మయూరి విద్యాలయంలో ప్రవేశం కల్పిస్తారు.

మరిన్ని వివరాలకు కలెక్టరేట్‌లోని జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా.. షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు జిల్లాలోని మరికొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద ప్రవేశాలు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మంచి అవకాశం
ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థులకు బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో ప్రవేశాలు మంచి అవకాశం. ఎంపికై న వారికి పదో తరగతి వరకు ఉచితంగా మెరుగైన విద్యనందిస్తాం. అలాగే ప్రభుత్వ పరంగా వారికి అన్ని వసతులు ఉచితంగా కల్పిస్తాం. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

– శాగంటి యాదగిరి,మయూరి విద్యాలయ కరస్పాండెంట్‌, కౌటాల

పారదర్శకంగా ఎంపిక
ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో 1, 5వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నాం. జూన్‌ 7లోగా దరఖాస్తులు జిల్లా కార్యాయలంలో అందించాలి. కలెక్టర్‌ సమక్షంలో లక్కీడ్రా పద్ధతిలో అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తాం.

– సజీవన్‌, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అధికారి

అర్హులు వీరు.. దరఖాస్తు ఇలా..
ఆసక్తి గల వారు జిల్లా కేంద్రంలోని జిల్లా షెడ్యూ ల్డ్‌ కులాలు అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు ఫారం తీసుకోవాలి. కుటుంబంలో ఒక విద్యార్థి మాత్రమే ఈ పథకానికి అర్హులు. జిల్లాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందేవారు 01– 06– 2018 నుంచి 31– 05– 2019 మధ్య జన్మించి ఉండాలి.

AP EAMCET Answer Key 2024: ఏపీ ఎంసెట్‌ ప్రిలిమినరీ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

జూన్‌ 1 నాటికి వారి వయస్సు ఐదు నుంచి ఆరేళ్ల లోపు ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల వారు రూ.2లక్షలోపు ఉండేలా మీసేవ ద్వారా ఏప్రిల్‌ 1 తర్వాత పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందుపర్చాలి.

దీంతోపాటు మీసేవ నుంచి పొందిన జనన ధ్రువీకరణ పత్రం, కుల, నివాస ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డు, మూడు కలర్‌ పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, తెల్లరేషన్‌ కార్డు జత చేయాలి. ఐదో తరగతి కోసం దరఖాస్తు చేసుకున్న వారు నాలుగో తరగతి మార్కుల జాబితాతోపాటు బోనఫైడ్‌ కూడా సమర్పించాలి.

#Tags