Engineering Colleges in Telangana : 69 శాతం ఇంజినీరింగ్ కాలేజీలు ఈ జిల్లాల్లోనే.. కోర్ బ్రాంచ్‌ల‌పై అవ‌గాహ‌న..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎక్క‌వ శాతం ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు మూడు జిల్లాల్లో మాత్ర‌మే ఉన్నాయి. పూర్తిగా 175 ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు తెలంగాణ రాష్ట్రంలో ఉండ‌గా అందులో 109 క‌ళాశాల‌లు హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉన్నాయి. అంటే, ఈ మూడు జిల్లాల్లోనే ఏకంగా 69 శాతం ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు.

AP Village Secretariat : గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పుల‌పై ప్ర‌భుత్వ నిర్ణ‌యం..!

అయితే, ఇందుకు కారణంగా విద్యార్థులు ఎంచుకుంటున్న సీఎస్ఈ బ్రాంచ్‌లోనే ఎక్కువ ప్ర‌వేశాలు ఉంటున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో సీఎస్ఈ కంప్యూట‌ర్ సైన్స్‌కు సంబంధిత బ్రాంచ్‌లోనే 69 శాతం ప్ర‌వేశాలు జ‌రుగుతున్నాయి. దీంతోనే కోర్ బ్రాంచ్‌ల‌కు గండిప‌డుతోందని తెలుపుతున్నారు అధికారులు. అయితే, విద్యార్థులకు కోర్ బ్రాంచ్‌ల‌పై అవ‌గాహ‌న పెంచేలా, ఆస‌క్తి క‌లిగేలా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు చేయాల‌ని వివరించారు అధికారులు.

Students Preparation Test : స‌ర్కారు విద్యార్థుల్లో సామ‌ర్థ్య‌న్ని వెలికితీసే ప‌రీక్ష‌.. రేప‌టి నుంచి..

#Tags