Time Management at Anganwadi : అంగన్వాడీల్లో సమయపాలన పాటించాలి.. ఈసీసీఈ డేలో..!
చిట్వేలి: అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు సమయపాలన పాటించాలని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శశికళ హెచ్చరించారు. స్థానిక ఎంపీపీ సభా భవనంలో జరిగిన ప్రాజెక్టు సమావేశంలో ఆమె మాట్లాడుతూ తల్లీ పిల్లల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే అంగన్ వాడీలు గర్భిణులు, బాలింతలు రక్తహీనతకు గురికాకుండా పౌష్టికాహారాన్ని సకాలంలో అందించాలన్నారు. ప్రతి నెల 5వ తేదీన జరిగే ఈసీసీఈ డేలో తల్లిదండ్రులకు పిల్లల అభివృద్ధిని వివరించడమేగాక, కమిటీలు వేసి అంగన్‌వాడీల బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం చిట్వేలి ప్రాజెక్టు సీడీపీఓ రాజేశ్వరి ఆధ్వర్యంలో పోషన్ అభియాన్‌లో భాగంగా మంజూరైన 25 అంగన్ వాడీ కేంద్రాలకు ఆర్‌ఓ వాటర్, నీళ్ల డ్రమ్ము, నూత్రిగార్డెన్, రైన్ వాటర్ హహారెస్టింగ్, ఎల్‌ఈడీ టీవీలను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ నాగరాజు, జిల్లా ప్రాజెక్టు సమన్వయ కర్త సైపుల్లా, చిట్వేలి ప్రాజెక్టు సూపర్ వైజర్లు వసుంధరమ్మ, విజయకుమారి, విశాలాక్షి, సురేఖారాణి, బీపీపి ధనలక్ష్మీ, అంగన్ వాడీ వర్కర్లు పాల్గొన్నారు.
Jobs for Ex Army : సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు దరఖాస్తులు.. వీరే అర్హులు..