Technical Course: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సుల పరీక్షలు.. ఎప్పుడు..?

ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. సర్టిఫికెట్‌ కోర్సులకు జరిపే పరీక్షల గురించి వెల్లడించారు జిల్లా విద్యాశాఖాధికారి. ఎవరు ఎటువంటి పరీక్షలు రాసేందుకు అర్హులో తెలిపారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు మార్చిలో, గుర్తించిన పరీక్ష కేంద్రాల్లో జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణత పొందిన వారు లోయర్‌ గ్రేడ్‌ పరీక్షలు అయిన డ్రాయింగ్‌, టైలరింగ్‌, హ్యాండ్లూమ్‌ పరీక్షలకు అర్హులన్నారు. లోయర్‌ గ్రేడ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారు మాత్రమే హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలకు అర్హులన్నారు. ఈనెల 20వ తేదీలోగా ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించాలని, రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 29వ తేదీ వరకు, రూ.75 అపరాధ రుసుంతో మార్చి 6వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.

TS Gurukulam Jobs Merit List and Certificate verification 2024 : గురుకుల ఉద్యోగాల‌ మెరిట్ లిస్ట్ ఇదే.. అలాగే..

సంబంధిత దరఖాస్తు, నామినల్‌ రోల్స్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మార్చి 7వ తేదీలోపు సమర్పించాలని పేర్కొన్నారు. లోయర్‌ గ్రేడ్‌ డ్రాయింగ్‌ రూ.100, హ్యాండ్లూమ్‌ వీవింగ్‌ రూ.150, టైలరింగ్‌ అండ్‌ ఎంబ్రాయిడరీ రూ.150 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హయ్యర్‌ గ్రేడ్‌కు సంబంధించి డ్రాయింగ్‌ రూ.150, హ్యాండ్లూం వీవింగ్‌ రూ.200, టైలరింగ్‌ అండ్‌ ఎంబ్రాయిడరీ రూ.200 ఫీజును గేట్‌వే ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌సీ.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

#Tags