School Students : టీచర్ బదిలీపై విద్యార్థుల ఆందోళన.. ఎంఈఓ స్పందిస్తూ..
పరిగి: తల్లిదండ్రుల తర్వాత చిన్నారులు గురువులను మార్గదర్శకులుగా భావిస్తారు. కాస్త ప్రేమ చూపే ఉపాధ్యాయులపై మమకారం పెంచుకుంటారు. వారు ఒక్కరోజు పాఠశాలకు రాకపోయినా ఆరా తీస్తారు. అలాంటిది ఏకంగా బదిలీ అయితే...మేమొప్పుకోమంటారు. మండల పరిధిలోని పెద్దిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇలాంటి పరిస్థితే తలెత్తింది. పాఠశాలలో పనిచేసే భాగ్యలక్ష్మి అనే ఉపాధ్యాయురాలంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టం. కొన్నేళ్లుగా పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటూ అందరి మన్ననలు పొందారు.
Job Mela in Govt Degree College : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి జాబ్ మేళా.. ఈ తేదీకే..!
అయితే మూడు రోజుల క్రితం సర్దుబాటులో భాగంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు భాగ్యలక్ష్మిని మండలంలోని శ్రీరంగరాజుపల్లికి బదిలీ చేశారు. అయితే విద్యార్థులు ఆమె బదిలీని జీర్ణించుకోలేకపోయారు. ‘మా టీచర్ మాకే కావాలి... మా మేడంను బదిలీ చేయొద్దు’ అంటూ సోమవారం తరగతులు బహిష్కరించారు. తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు తాళం వేసి ఆందోళనకు దిగారు. తమ టీచర్‌ను ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంతవరకూ తరగతులను హాజరుకాబోమని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
School Holiday Cancel : ఆరోజు స్కూళ్లకు సెలవు క్యాన్సెల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఈ విషయంపై ఎంఈఓ లక్ష్మీదేవి స్పందిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు పెద్దిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను సర్దుబాటు చేశామన్నారు. పాఠశాలలో 82 మంది విద్యార్థులు ఉన్నారని, అందువల్ల నిబంధనల మేరకు అక్కడ ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉండాలన్నారు. ఈ క్రమంలో సర్‌ప్లస్‌గా ఉన్న భాగ్యలక్ష్మిని శ్రీరంగరాజుపల్లికి బదిలీ చేశామన్నారు. పాఠశాలలో మరో 10 మంది విద్యార్థులు పెరిగితే తప్పకుండా టీచరును నియమించేందుకు వీలుంటుందన్నారు.
Guest Faculty Posts : ఎస్‌ఎస్‌సీటీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు..