Spoken English: కేయూలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు

కేయూ క్యాంపస్‌: కేయూలోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ (సెల్ట్‌) ఆధ్వర్యంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తరగతులు జూలై 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సెల్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మేఘనరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆసక్తిగల విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులెవరైనా జూలై 9వ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కేయూ విద్యార్థులు, ఉద్యోగులకు రూ.1,000, ఇతరులకు రూ.1,500 ప్రిన్సిపాల్‌, యూనివర్సిటీ కాలేజీకి నాన్‌ యూనివర్సిటీ ఫండ్‌లో చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. జూలై 10 నుంచి 40 రోజులపాటు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

#Tags