ZP High School: జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్ర‌వేశానికి ప్ర‌త్యేక డ్రైవ్‌..

రాజవొమ్మంగి: స్థానిక శ్రీ అల్లూరి సీతారామరాజు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వివిధ తరగతుల్లో ప్రవేశం, సీట్ల భర్తీకి ప్రత్యేక డ్రైవ్‌ జరుగుతోంది. ఇంటింటికి వెళ్లి పిల్లల్ని పాఠశాలలో చేర్పించమని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఈ తరహా కార్యక్రమంలో 5, 6 తరగతుల్లో చేర్పించేందుకు ఐదుగురిని గుర్తించామని హెచ్‌ఎం బీవీ గోపాలకృష్ణ తెలిపారు.

Students Talent: బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థినులు ప్రతిభ

జీపీఎస్‌, ఎంపీపీ పాఠశాలల్లో 5వ తరగతి పాసైన వారిని జెడ్పీ పాఠశాలలో 6వ తరగతిలో చేర్పిస్తున్నామని ఆయన వివరించారు. ఈ పాఠశాలలో 3వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు సుమారు 600 మంది చదువుతున్నారు. పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఇదే పాఠశాల ప్రాంగణంలోని పది ప్లస్‌ ఉమన్స్‌ జూనియర్‌ కళాశాలలో చేర్పించేందుకు కూడా కృషి చేస్తున్నామని తెలిపారు.

Govt Degree College Admissions: ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ..!

#Tags