Skill Training: ఎస్‌ఏపీతో చేతులు కలిపిన ‍క్యాప్‌జెమినీ.. 8000 మందికి ట్రైనింగ్‌

ముంబై: ఐటీ దిగ్గజం క్యాప్‌జెమినీ తాజాగా ఎస్‌ఏపీ ల్యాబ్స్‌తో చేతులు కలిపింది. వచ్చే మూడేళ్లలో దేశీయంగా 8,000 మంది వెనుకబడిన యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు క్యాప్‌జెమినీ–ఎస్‌ఏపీ డిజిటల్‌ అకాడెమీ ప్రోగ్రాంను అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.

దీని ప్రకారం ఇరు సంస్థలు సంయుక్తంగా వనరుల సమీకరణ, నెట్‌వర్క్‌లు మొదలైన వాటిపై ఇన్వెస్ట్‌ చేస్తాయని క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో అశ్విన్‌ యార్డి తెలిపారు.

TTD Contract jobs Interviews: TTDలో కాంట్రాక్టు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

తమ కెరియర్‌లలో విజయాలను అందుకునేందుకు దేశ యువతకు సాధికారత కల్పించేందుకు ఈ భాగస్వామ్యం సహాయకరంగా ఉండగలదని ఎస్‌ఏపీ ల్యాబ్స్‌ ఇండియా ఎండీ సింధు గంగాధరన్‌ పేర్కొన్నారు.  

#Tags