Second Phase Counselling : సెల్ఫ్ సపోర్ట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో దశ కౌన్సెలింగ్ రెండో దశ కౌన్సెలింగ్ ప్రారంభం..
ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఆఈట్) ద్వారా సెల్ఫ్ సపోర్ట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నుంచి రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సంచాలకుడు ఆచార్య డీఏ నాయుడు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఖాళీల వివరాలను ఈ నెల 21న వెబ్సైట్లో ఉంచుతారు. వెబ్ఆప్షన్లు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఇవ్వాలి. 27న రెండో దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రవేశాలు పొందిన వారు ఈ నెల 28 నుంచి జూలై 4వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించాలి.
#Tags