Schools & Colleges Holidays October 2023 List : అక్టోబ‌ర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు అత్యంత భారీగా సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్స్‌, కాలేజీ విద్యార్థులకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే నెల అక్టోబ‌ర్ నెల‌. ఎందుకంటే.. ఈ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు ఎక్కువ రోజులు పాటు సెల‌వులు ఇవ్వ‌నున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల‌తో పాటు.. దేశ‌వ్యాప్తంగా అత్యంత ఘ‌నంగా జ‌రుపుకునే ద‌స‌రా పండ‌గ కూడా ఈ నెల‌లోనే వ‌స్తుంది.
schools and colleges holidays october 2023

అక్టోబ‌ర్ 1వ తేదీన ఆదివారం, అలాగే 2వ తేదీ గాంధీ జయంతి. క‌నుక అక్టోబ‌ర్ 1,2 వ తేదీల్లో వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు రానున్నాయి. అలాగే అక్టోబ‌ర్ 8వ తేదీన ఆదివారం స్కూల్స్‌, కాలేజీల‌కు సాధ‌ర‌ణ సెల‌వు ఉన్న విష‌యం తెల్సిందే. 

తెలంగాణ‌లో ద‌స‌రా సెల‌వులు మొత్తం ఎన్ని రోజులంటే..?

తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే హాలీడేస్‌ను ప్ర‌క‌టించారు. అలాగే ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీల‌కు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు త‌మ క్యాలెండర్‌లో సెల‌వులను పొందుప‌రిచారు. తెలంగాణ‌లో ఇక అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు స్కూల్స్‌, కాలేజీల‌కు ద‌స‌రా, బ‌తుక‌మ్మ సెలవులు ఉండనున్నాయి. మొత్తం 13 రోజులు పాటు తెలంగాణలో వ‌రుస‌గా ద‌స‌రా సెల‌వులు ఇచ్చారు. తిరిగి అక్టోబర్ 26వ తేదీన (గురువారం) పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి.

☛ Four Days School & Colleges Holidays : వ‌రుస‌గా స్కూల్స్‌, కాలేజీల‌కు నాలుగు రోజులు పాటు సెల‌వులు.. ఎందుకంటే...?

ఏపీలో ద‌స‌రా సెల‌వులు మొత్తం ఎన్ని రోజులంటే..?

అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌భుత్వ‌,ప్రైవేటు స్కూల్స్‌కు అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చారు. మొత్తం 10 రోజుల పాటు స్కూల్స్‌కు ద‌స‌రా సెల‌వులు రానున్నాయి. తిరిగి అక్టోబర్ 25వ తేదీన (బుధ‌వారం) పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణ‌తో  పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దసరా సెల‌వులు త‌క్కువ‌గానే ఉన్నాయి.

☛ Tenth and Inter Public Exams : ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

నెల చివ‌రిలో కూడా వ‌రుస‌గా రెండో రోజులు సెల‌వులు..

అక్టోబ‌ర్ 28వ తేదీ నాల్గోవ శ‌నివారం, అక్టోబ‌ర్ 29న ఆదివారం ఉన్న విష‌యం తెల్సిందే. దీంలో అక్టోబ‌ర్ 28,29వ తేదీల్లో మ‌రో రెండు రోజులు పాటు వ‌రుస‌గా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు రానున్నాయి. ఈ అక్టోబ‌ర్ నెల‌లో మొత్తం ఐదు ఆదివారాలు వ‌చ్చాయి. దీంతో అక్టోబ‌ర్ నెల‌లో తెలంగాణ‌లో మొత్తం 18 రోజులు సెల‌వులు రానున్నాయి. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 15 రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్

తెలంగాణ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ఆంధ్ర‌ప్ర‌దేశ్ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే..)
☛ ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ మొద‌లైన పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

☛ NTA NEET, JEE Exam Dates 2023 : నీట్‌, జేఈఈ-2024 ప‌రీక్ష‌ల తేదీ ఇవే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

#Tags