Student Death : మరుగుదొడ్లు లేని పాఠశాలలు.. బాలుడు మృతి!!

స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు..

తిమ్మాపూర్‌: పాఠశాలలో మరుగుదొడ్డి లేకపోవడంతో బహిర్భూమికి వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. ఈ విషాద ఘటన తిమ్మాపూర్‌ మండలంలో ని మొగిలిపాలెంలో చోటుచేసుకుంది. ఎల్‌ఎండీ పోలీసుల కథనం ప్రకారం.. మొగిలిపాలెం గ్రామానికి చెందిన జవ్వాజి మురళి కుమారుడు సాయికృష్ణ (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం బడికి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి, అన్నం తిని, తిరిగి పాఠశాలకు వచ్చాడు. తర్వాత తన స్నేహితులతో కలిసి సమీపంలోని చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు జారి, అందులోనే పడిపోయాడు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

TG EAPCET 2024 Second Phase Counselling Schedule: ఈనెల 26నుంచి ఇంజనీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌

పట్టించుకోని ఉపాధ్యాయులు..

పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు బహిర్భూమికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

పేరెంట్స్‌ మీటింగ్‌ జరిగిన రెండు రోజులకే..

పాఠశాలలో శనివారమే పేరెంట్స్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఇందులో కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థులను బయటకు పంపించొద్దని ఉపాధ్యాయులకు సూచించారు. అయితే, పాఠశాలలో పూర్తిస్థాయిలో టాయిలెట్స్‌ లేక పిల్లలు చెరువు సమీపంలోకి వెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సమావేశం జరిగిన రెండు రోజులకే విద్యార్థి చెరువులో మునిగి మృతిచెందాడని, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంగా వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు.

Shiksha Saptah 2024: పాఠశాలల్లో ‘శిక్షా సప్తాహ్‌’

తల్లి దూరమైనా..

సాయికృష్ణకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు(పదేళ్ల క్రితం) మురళి అతని భార్య విభేదాల కారణంగా దూరమయ్యారు. ఆమె మరో పెళ్లి చేసుకోవడంతో కుమారుడు ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకొని, తండ్రి తన వద్దకు తీసుకొచ్చాడు. అనంతరం కొడుకు యోగక్షేమాలు చూసేందుకు ఆరేళ్ల క్రితం పద్మ అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె సాయికృష్ణ సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటోంది. ఈ క్రమంలో ఆ విద్యార్థి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

PG Courses In Kakatiya University: ఈనెల 28 నుంచి కాకతీయ యూనివర్శిటీలో దూరవిద్య పీజీ తరగతులు

#Tags