School Fees for Admissions : పేద విద్యార్థుల తల్లిదండ్రులపై భారం.. ఎందుకంటే..

పేద విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలో పైసా ఖర్చు లేని ఉచిత విద్యను అందించేందుకు బంగారు బాటలు వేసింది గత ప్రభుత్వం..

ఆళ్లగడ్డ: ‘అక్షర జ్ఞానంతోనే పేదల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచవచ్చు’ అనే సంకల్పంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. పేద విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలో పైసా ఖర్చు లేని ఉచిత విద్యను అందించేందుకు బంగారు బాటలు వేసింది. ఏటా ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణతో ప్రారంభించి అర్హులైనవారికి సీట్ల కేటాయింపు, ఎంపికైన విద్యార్థులు పాఠశాలల్లో చేరే వరకు ప్రతి దశలో పటిష్టమైన చర్యలు చేపట్టింది.

MDS Admissions: ఎండీఎస్‌ వెబ్‌ఆప్షన్ల నమోదుకు రేపే చివరి తేది

ఫలితంగా రెండు సంవత్సరాలు ఈ పథకం పక్కాగా అమలైంది. అయితే రెండు నెలల క్రితం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యపై నీలినీడలు అలుముకున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తరగతులకు చెందిన చిన్నారులతో పాటు దివ్యాంగులకు కచ్చితంగా 25 శాతం సీట్లు కేటాయించాల్సింది ఉండగా యాజమాన్యాలు సీట్ల భర్తీకి నిరాసక్తత చూపుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది ఉచిత విద్యకు ఎంపికైన విద్యార్థుల ఫీజు చెల్లిస్తుందో లేదోనని ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులు సందిగ్దత వ్యక్తం చేస్తున్నాయి.

Govt ITI Admissions : ప్ర‌భుత్వ ఐటీఐలో 3వ విడ‌త ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. ఈ తేదీల్లోనే..

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే చేర్పించిన వారు సైతం కొందరు మధ్యలో ఫీజులు కట్టాల్సి వస్తుందని భయపడి మళ్లీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చుతున్నారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ సూళ్లు అన్నింటిలోనూ ప్రతి విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో తప్పనిసరిగా 25 శాతం సీట్లు పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు కేటాయించాలి. ఇందులో అనాథలు, దివ్యాంగులు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, ఇతర వర్గాలకు 6 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంది.

President Medal: తెలంగాణ హెడ్ కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి అవార్డు

అయితే 2024–25 విద్యా సంవత్సరం మూడు విడతల్లో ఎంపిక చేసిన సీట్లను పరిశీలిస్తే ఎక్కడా కూడా నిబంధనలు పాటించినట్లు కనిపించడం లేదు. నంద్యాల జిల్లాలో 500 పైగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో నిబంధనల ప్రకారం 25 శాతం సీట్లు కేటాయిస్తే కనీసం 10 వేల మంది పిల్లలకు ప్రవేశం కల్పించవచ్చు. అయితే ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్నదే 1,862 మంది అయితే అందులో మూడు విడతలుగా వడపోసి కేవలం 945 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఇక ఈ విద్యా సంవత్సరానికి ఇంతే అని అధి కారులు చేతులు దులుపుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

Govt Jobs : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయాలి..

ఫీజు భారమై..

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీటు పొందిన విద్యార్థులు ఏడాదికి ఎంత ఫీజు చెల్లించాలనేది ప్రభుత్వం ముందుగానే నిర్ణయించింది. పట్టణాల్లో రూ. 8 వేలు, రూరల్‌లో రూ. 6,500, గిరిజన ప్రాంతాల్లో రూ. 5,100 చొప్పున అడ్మిషన్‌ పొందిన ప్రైవేటు పాఠశాలలకు గత ప్రభుత్వం నేరుగా చెల్లించింది. అయితే ఈ ప్రభుత్వం ఫీజుల చెల్లింపుల గురించి ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో ఉచిత విద్యాహక్కు చట్టం కింద చేరిన పిల్లలకు యాజమాన్యాలు విద్య సక్రమంగా అందిస్తుందా ..? లేదా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. దీంతో చాలా మంది ఈ ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించడం కన్నా.. ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయానికి వస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.

TS TET 2024 ALERT : టెట్ రాసిన అభ్య‌ర్థులు అల‌ర్ట్‌.. అలాగే డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు కూడా..

ఆళ్లగడ్డ పట్టణ శివారులోని పడకండ్ల ఎస్సీ కాలనీకి చెందిన ఒంటరి మహిళ తన కూతురుకు ఉచిత విద్య సీటు వచ్చిందని సచివాలయ సిబ్బంది తెలపడంతో సమీపంలోని ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. పుస్తకాలు, యూనిఫాం ఇతర వాటికి కలిపి సుమారు రూ. 4,500 కట్టించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారిందని, ఉచిత విద్య జీఓ అమలు చేయడం లేదని, అందరూ చెల్లించే ఫీజులో సగమైనా కట్టాలని స్కూలు యాజమాన్యం ఒత్తిడి చేస్తుందని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Staff Nurse Counselling : కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్స్‌ల నియామకాల కౌన్సెలింగ్ ప్రారంభం.. రోజుకు..

#Tags