School Assistant Promotions: మిగిలిపోయిన పోస్టులకు పదోన్నతి అవకాశం ఇవ్వాలి

జగిత్యాల: ఇటీవల స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల్లో మిగిలిపోయిన పోస్టులను ప్రమోషన్‌ ద్వారా నింపాలని తపస్‌ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం డీఈవో జగన్మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ ప్రమోషన్లు ఆన్‌లైన్‌లో జరపడం వల్ల ఒక ఉపాధ్యాయుడికి ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో రెండు, మూడు చొప్పున ప్రమోషన్‌ ఆర్డర్లు వచ్చాయని తెలిపారు.

TS Gurukulam: గురుకులాలకు ఉద్యోగుల కేటాయింపు.. వారికి తప్ప మిగిలిన వారికి అలాట్‌మెంట్‌

దీనివల్ల సీనియర్‌ లిస్టులో కింద ఉన్న టీచర్లు నష్టపోయారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, విద్యాశాఖ ప్రకటించిన అన్ని సబ్జెక్టుల్లో మిగులు పోస్టులకు వెంటనే పదోన్నతి అవకాశం కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహ అధ్యక్షుడు నరేందర్‌రావు, ఉపాధ్యక్షుడు ఒడ్నాల రాజశేఖర్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవయ్య, ప్రసాద్‌రావు పాల్గొన్నారు.

#Tags