Scholarship Exam for School Students : ప్ర‌తిభావంతులైన విద్యార్థుల‌కు చేయూత‌గా ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష‌.. ఈ త‌ర‌గ‌తికి మాత్ర‌మే..

ప్రతిభావంతులైన పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది.

భీమవరం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతిభావంతులైన పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. దీనికి ఈ ఏడాదికి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ కాగా, దరఖాస్తుకు సెప్టెంబర్‌ 15 వరకూ గడువుంది. ప్రభుత్వ పాఠశాల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధులు మాత్రమే పోటీపరీక్షకు అర్హులు. అర్హత సాధిస్తే 9వ తరగతి నుంచి సీనియర్‌ ఇంటర్‌ వరకూ ఏటా రూ.12 వేల చొప్పున ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. జిల్లాలో 2022లో 198 మంది, 2023లో 144 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

Vande Bharat Sleeper Train: పట్టాలపైకి రానున్న‌ వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. ఎప్పుడంటే..

పరీక్ష విధానం

మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌(మ్యాట్‌)లో 90 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 90 మార్కులు కేటాయిస్తారు. స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (శాట్‌)లో 90 ప్రశ్నలుంటాయి. మొత్తం 90 మార్కులు. 7, 8వ తరగతుల స్థాయిలో సైన్స్‌, సోషల్‌, మ్యాథ్స్‌ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. నెగిటివ్‌ మార్కులు ఉండవు. ఫిజిక్స్‌లో 12 మార్కులు, కెమిస్ట్రీలో 11, బయాలజీలో 12, మ్యాథ్స్‌ 20, హిస్టరీ 10, జాగ్రఫీ 10, పొలిటికల్‌ సైన్స్‌ 10, ఎకనామిక్స్‌లో 5 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

Skill Training Centre: శిక్షణ పొందిన అభ్యర్థులకు పరీక్షలు

అర్హతలు

7వ తరగతిలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. తుది ఎంపిక నాటికి 8వ తరగతిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 50 శాతం మార్కులు సాధిస్తే చాలు. ప్రభుత్వ, మున్సిపల్‌, జెడ్పీ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో రెగ్యులర్‌ విధానంలో చదివే విద్యార్థులు మాత్రమే అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు. రాత పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేసే పరీక్షలో ఓసీ జనరల్‌, బీసీ, పీహెచ్‌ విద్యార్థులకు 40 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 32 శాతం మార్కులు రావాలి.

Fee Reimbursement: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

దరఖాస్తు విధానం

రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు వైబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆయా పాఠశాలల్లో ఇచ్చి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా సెప్టెంబర్‌ 15లోపు దరఖాస్తు చేయించుకోవాలి. పరీక్ష ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజులో 50 శాతం మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ఫారాలు, ధ్రువీకరణ పత్రాలు సెప్టెంబర్‌ 15 లోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలి. అర్హులైన విద్యార్థులకు డిసెంబర్‌ 8న పోటీ పరీక్ష నిర్వహిస్తారు.

Navodaya Admissions: నవోదయకు దరఖాస్తుల ఆహ్వానం

పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేసే మెరిట్‌ స్కాలర్‌షిప్‌ ఎంతో ఉపయోగకరం. ఆర్థిక ఇబ్బందులున్నా ఉన్నత చదువులు అభ్యసించాలనే ఆశయం ఉన్న విద్యార్థులకు ఎంతగానో దోహదం చేస్తుంది.

– జి.నాగమణి, జిల్లా విద్యాశాఖాధికారిణి, భీమవరం

Collector Deepak Tiwari: పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలి

#Tags