SBI Asha Scholarship 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐ ఆశా స్కాలర్‌షిప్‌తో లక్షల్లో ఆర్థిక సాయం.. పూర్తి వివరాలు ఇవే
విద్యార్థులకు గుడ్‌న్యూస్. ప్రతిభగల పేద విద్యార్థులకు చేయూతనందించి, వారి విద్యను ప్రోత్సహించేందుకు ఎస్‌బీఐ ఆశా స్కాలర్‌షిప్ సహకారం అందిస్తోంది. వెనకపడిన వర్గాలకు చెందిన 10వేల మంది టాలెంటెడ్ స్టూడెంట్స్‌ను గుర్తించి వారి చదువులకు ఆర్థిక సహాయం చేస్తోంది. దీని ద్వారా విద్యార్థులకు రూ. 15వేల నుంచి రూ. 20లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఆరవ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివి ఉండాలి. డిగ్రీ, పీజీ, ఐఐటీ, ఐఐఎంలలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.
» గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం రూ.3లక్షలకు మించకూడదు.
స్కాలర్‌షిప్ వివరాలు
» ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ.15,000.
» అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.50,000
» పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.70,000.
» ఐఐటీ విద్యార్థులకు రూ.2,00,000.
» ఐఐఎం(ఎంబీఏ/పీజీడీఎం) విద్యార్థులకు రూ.7.50 లక్షలు.
» ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికచేస్తారు. దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా స్కాలర్‌షిప్ మొత్తాన్ని జమ చేస్తారు. ఇది వన్‌టైమ్ స్కాలర్‌షిప్ మాత్రమే.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్/మొబైల్ నంబర్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 01, 2024
» వెబ్‌సైట్: www.sbifashascholarship.org
Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. జాబ్‌మేళాకు ఆహ్వానం
SBI Asha Scholarship.. ఇలా అప్లై చేసుకోండి
- ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్ sbifashascholarship.org క్లిక్ చేయండి
- హోంపేజీలో కనిపిస్తున్న అప్లై ఆన్‌లైన్ బట్ మీద క్లిక్ చేయండి.
- రిజిస్టర్డ్ ఐడీ లేదా ఈమెయిల్/ మెభైల్ నెంబర్‌తో Buddy4Study లో లాగిన్ అవ్వండి.
- SBIF Asha Scholarship Program 2024 అప్లికేషన్ ఫామ్‌ని పూర్తి చేయండి. అవసరమైన డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేయండి.
- ప్రివ్యూ చేసి సబ్మీట్ చేయండి.