INSPIRE Manak : ఇన్‌స్పైర్ వైపు విద్యార్థుల‌కు ప్రోత్సాహం, అవ‌గాహ‌న అందించాలి.. న‌మోదుకు గ‌డువు..

పాఠశాల స్థాయిలో విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రోత్సాహం కరువవుతోంది. చిట్టి బుర్రల్లో నూతన ఆలోనచలను రేకెత్తించాల్సిన యాజమాన్యాలు బాధ్యతను విస్మరిస్తున్నాయి.

గుంటూరు: పాఠ్య పుస్తకాలకే పరిమితం చేస్తున్నాయి. సృజనాత్మక నైపుణ్యాల్ని వెలికితీయడంలో విఫలమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్‌ మానక్‌ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలకు విద్యార్థుల్ని పంపుతున్న పాఠశాలల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే ప్రైవేటు రంగంలోని పాఠశాలలు వెనుకంజలో ఉన్నాయి. ఇన్‌స్పైర్‌ ప్రదర్శనల సమాచారాన్ని చేరవేసి ఆసక్తి గల వారిని ప్రోత్సహించే కనీస బాధ్యతను విస్మరిస్తున్నాయి. విద్యార్థుల్ని ప్రోత్సహించడంలో గుంటూరు నగరంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు వెనుకబడ్డాయి.

నమోదుకు గడువు పొడిగింపు

కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ ఏటా నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్‌ మానక్‌ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనల్లో భాగంగా 2024–25 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌లో విద్యార్థులతో ప్రతిపాదనలు స్వీకరిచేందుకు గడువు ఆదివారంతో ముగిసింది. అయితే ప్రాజెక్టుల నమోదుకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పిస్తూ అక్టోబర్‌ 15 వరకు పొడిగించింది. విద్యా, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అంతరిక్ష, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల వారీగా నూతన ఆవిష్కరణలకు దోహదం చేసే సమగ్ర నివేదికను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది.

MBBS 2024 Seats: 2023–24లో ఎంబీబీఎస్‌ కన్వినర్‌ కోటా సీట్ల కేటాయింపు

ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల నుంచి ఐదు, ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో మూడు చొప్పున విద్యార్థులతో ప్రాజెక్టు నివేదికలను రూపొందించాలి. ఇందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించేందుకు సైన్స్‌ ఉపాధ్యాయులకు బాధ్యత అప్పగించాలి. ఎంపికై న విద్యార్థులకు ప్రాజెక్టు తయారీకి కేంద్ర ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి టెన్త్‌ వరకు చదువుతున్న విద్యార్థులు ఎంచుకున్న ప్రాజెక్టు పేరు, దాని వల్ల సమాజానికి, ప్రజలకు మేలు చేసే అంశాలతో నివేదికను గైడ్‌ టీచర్‌ సహాయంతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్లు నత్తనడక

ఇన్‌స్పైర్‌ మనక్‌ సైన్స్‌ ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను తొలుత డివిజన్‌ స్థాయిలో ప్రదర్శిస్తారు. అక్కడి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. గుంటూరు జిల్లాలోని 1,073 ప్రభుత్వ పాఠశాలలతో పాటు 601 ప్రైవేటు పాఠశాలల పరిధిలో ఆదివారం నాటికి 950 మాత్రమే ఇన్‌స్పైర్‌ మానక్‌ రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో 165 ప్రభుత్వ, 30 ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాజెక్టులను నమోదు చేసుకున్నారు. ఇందులోని 95 ప్రాజెక్టుల్లో 75 శాతం ప్రభుత్వ విద్యార్థులే ఉన్నారు.

భావి శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వని ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను ప్రోత్సహించడంలో నిర్లక్ష్యం ఇన్‌స్పైర్‌ మానక్‌ 2024–25 నమోదుకు తుది గడువు వచ్చేనెల 15కు పొడిగింపు ఎంపికైన విద్యార్థులకు ప్రాజెక్టు తయారీకి రూ.10 వేలు మంజూరు చేయనున్న కేంద్రం ఇన్‌స్పైర్‌కు నమోదు చేసుకున్న వారిలో 75 శాతం ప్రభుత్వ విద్యార్థులే..

Digital Students Organization: ది బెస్ట్‌ ఎడ్యుకేటర్‌ అవార్డు

పాఠశాలలపై చర్యలు చేపడతాం

ఇన్‌స్పైర్‌ మానక్‌ ప్రదర్శనలకు జిల్లాలోని అన్ని యూపీ, హైస్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులకు సమాచారం ఇచ్చి, ఆసక్తి గల వారిని ప్రోత్సహించాలి. తరగతి గదిలో చదువుతో పాటు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి పర్చడంలో ఐన్‌స్పైర్‌ ప్రోగ్రామ్‌ ఎంతో కీలకం. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్‌ చేయించుకోని పాఠశాలలు పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలి.

– పి.శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి

గుంటూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూళ్లు : 1,674

ఇప్పటి వరకు నమోదు చేసుకున్న పాఠశాలలు : 195

వీటిలో ప్రభుత్వ స్కూళ్లు : 165

ప్రైవేటు స్కూళ్లు : 30

ఇప్పటి వరకు నమోదైన ప్రాజెక్టులు : 950

Alumni in Agriculture College : వ్య‌వ‌సాయ క‌ళాశాల‌లో పూర్వ విద్యార్థుల సంబ‌రాలు..

#Tags