Women's Degree College: మహిళా డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్‌ అడ్మిషన్లు

డాబాగార్డెన్స్‌ : విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ స్పాట్‌ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌. శోభారాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీ ఆసెట్‌ రాసి, సీట్‌ రాని విద్యార్థులకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు చెప్పారు.
12 పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9052297729, 9396235303 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

చ‌ద‌వండి: JNTU Anantapur: పీహెచ్‌డీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల

#Tags