Admissions in Sports Academy: 3,4 తేదీల్లో క్రీడా అకాడమీలో ప్రవేశాలకు ఎంపికలు

విజయనగరం: డాక్టర్‌ వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో గల రాష్ట్ర క్రీడా అకాడమీలో ప్రవేశాల కోసం అక్టోబర్ 3,4 తేదీల్లో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా స్థాఽయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సెట్విజ్‌ సీఈఓ బి.రామ్‌గోపాల్‌ సెప్టెంబర్ 28న తెలిపారు. బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, హకీ, టెన్నిస్‌, వాలీబాల్‌ క్రీడాంశాల్లో విజయనగరం జిల్లా కేంద్రంలో గల రాజీవ్‌ క్రీడామైదానం ప్రాంగణంలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీల్లో 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారు పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని, అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొనవచ్చని, మరిన్ని వివరాలకు ఫోన్‌ 9177070098 నంబర్‌ను సంప్రదించాలని పిలుపునిచ్చారు.

చదవండి: Skill Colleges: పేద విద్యార్థులకు వరం.. స్కిల్‌ కళాశాల

#Tags