APECET Counselling 2024 : నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఏపీఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం..

తిరుపతి: తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో బుధవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఏపీ ఈసెట్‌–2024 కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కో–ఆర్డినేటర్‌ వై.ద్వారకనాథ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులంతా ఈ నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుని తమ సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలన్నారు.

Mechanical Engineering Career: మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? బెస్ట్‌ కాలేజ్‌ ఎలా ఎంచుకోవాలి?

జూలై 1 నుంచి 4వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు, 5న మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని, 8వ తేదీన సీట్‌ అలాట్‌మెంట్‌ చేస్తామన్నారు. వివరాలకు ‘‘apsche.ap.gov.in’’ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. స్పెషల్‌ కేటగిరి (పీహెచ్‌, ఎన్‌సీసీ, క్యాప్‌, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌, ఆంగ్లో ఇండియన్స్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌)అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు 2 సెట్ల జిరాక్స్‌ కాపీలతో జూలై 2, 3 తేదీల్లో విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సంప్రదించాలన్నారు.

AP PGECET Rankers : పీజీఈసెట్‌లో జేఎన్‌టీయూఏ విద్యార్థుల స‌త్తా..!

#Tags