National Scholarship: నేషనల్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
ఒంగోలు సెంట్రల్: 2024–25 విద్యా సంవత్సరంలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిఫ్ (ఎన్‌ఎంఎంఎస్)కు జిల్లాలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.సుభద్ర సూచించారు.
జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా ప్రజాపరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్, ప్రాథమికోన్నత, ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు.
NEET Paper leak Case: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ముందడుగు..‘మాస్టర్‌మైండ్’ అరెస్ట్
విద్యార్థుల కటుంబ ఆదాయం రూ.3.5 లక్షలలోపు ఉండాలని, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 రుసుం చెల్లించి ఈ నెల 6వ తేదీలోగా ఆన్‌లైన్లో దరఖాస్తు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. పరీక్ష రుసుం ఆన్‌లైన్‌లో పేర్కొన్న ఎస్‌బీఐ కలెక్ట్ లింక్ ద్వారా మాత్రమే చెల్లించాలని సూచించారు.