NAAC Committee: యూనివర్సిటీలో న్యాక్‌ బృందం మూడు రోజుల సందర్శన..!

రేపు జేఎన్‌టీయూలో న్యాక్‌ బృందం సందర్శించనుంది. ఈ నేపథ్యంలో వర్సిటీకి రానున్న సభ్యుల వివరాలను వెల్లడించారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: జేఎన్‌టీయూ (ఏ)కు గురువారం న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) పీర్‌ కమిటీ రానుంది. వర్సిటీకి గ్రేడింగ్‌ ఇచ్చే నిమిత్తం 3 రోజుల పాటు సందర్శించనుంది. జేఎన్‌టీయూ స్థాపించాక తొలిసారి న్యాక్‌ గ్రేడింగ్‌కు వెళ్తుండడం గమనార్హం. పీర్‌ కమిటీలో పి. సంగాణి, రాఘవ, జయంతి, సతీష్‌ పాల్‌, మంజునాథ సభ్యులుగా ఉన్నారు.

Students Education: పాఠశాల తనిఖీలో ఉపాధ్యాయులకు సూచన..!

ఇప్పటికే జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలకు ఎన్‌బీఏ (నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌) గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే న్యాక్‌ గ్రేడింగ్‌ వచ్చేలా వర్సిటీ ఉన్నతాధికారులు కృషి చేశారు. న్యాక్‌ గుర్తింపు దక్కితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీల నుంచి గణనీయంగా నిధులు దక్కే అవకాశం ఉంటుంది. వర్సిటీ జారీ చేసే సర్టిఫికెట్‌కు మంచి గుర్తింపు లభిస్తుంది. కాగా, న్యాక్‌ పీర్‌ కమిటీ సభ్యులు బుధవారం సాయంత్రమే జేఎన్‌టీయూ చేరుకుంటారని సమాచారం.

#Tags