Skills Required for Students: జీవన నైపుణ్యాలు విద్యార్థుల శారీరక ఆరోగ్యం, మానసిక వికాసానికి దోహదం!

విద్యార్థుల భవిష్యత్తును ఆనందమయం చేయడానికి జీవన నైపుణ్యాలు దోహదం.

విద్యార్థుల భవిష్యత్తును ఆనందమయం చేయడానికి జీవన నైపుణ్యాలు దోహదం చేస్తాయని డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు. కశింకోటలోని సెయింట్‌ జాన్స్‌ స్కూలులో వ్యాయామ, ఇతర ఉపాధ్యాయులకు రెండో రోజు నిర్వహిస్తున్న జీవన నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా శిక్షణ తీరును, వివిధ రకాల కృత్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల శారీరక ఆరోగ్యం, మానసిక వికాసానికి విద్యాభివృద్ధికి శిక్షణ దోహదం చేస్తుందన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో విద్యార్థులకు బోధించి వారికి ఉపయోగపడేటట్లు కృషి చేయాలన్నారు.

రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధనా సంస్థ అధ్యాపకురాలు హేమరాణి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కోర్సు సహాయ కోఆర్డినేటర్‌ గొట్టేటి రవి, ఎంఈవో చిట్టిబాబు, ప్రిన్సిపాల్‌ దీప, మ్యూజిక్‌ బస్సు జిల్లా కోఆర్టినేటర్‌ అశోక్‌కుమార్‌రాజు, రిసోర్స్‌ పర్సన్లు జె. మాధవి, అబ్దుల్‌ రెహమాన్‌, ఎస్‌.సుశీల, అప్పలరాజు, పీఈటీ సంఘం కార్యదర్శి కిరణ్‌ పాల్గొన్నారు.

#Tags