Students Education: చదువులో విద్యార్థుల స్థాయిని గుర్తించాలి..

పలు ప్రాంతాల్లో రాష్ట్రస్థాయి సర్వేలో భాగంగా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మి మాట్లాడుతూ..

మునగపాక: విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటలక్ష్మి అన్నారు. చదువులో విద్యార్థుల స్థాయిని గుర్తించి మరింత పదును పెట్టి, గ్రేడ్‌లు సాధించేందుకు అవసరమయ్యే ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు.

Admission Test: 6వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష.. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ ఇలా..

మంగళవారం ఆమె టి.సిరసపల్లి, వెంకటాపురం, నాగులాపల్లి, మునగపాక పాఠశాలల్లో రాష్ట్ర స్థాయి సర్వేలో భాగంగా ఆమె విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించారు. నాల్గవ తరగతి విద్యార్థుల సౌలభ్యం కోసం స్లాస్‌ విధానం అమలు జరుగుతుందన్నారు. ఆమె వెంట క్షేత్రస్థాయి పరిశీలకులు కర్రి లక్ష్మినారాయణ, అచ్యుతకృష్ణ, నూకేష్‌ పాల్గొన్నారు.

Flagship Exams: యూపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఫ్లగ్‌షిప్‌ పరీక్షలు.. షెడ్యూల్‌ ఇలా..!

#Tags