Kakatiya University: ఎంబీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్ష ఫీజు గడువు

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధి ఎంబీఏ నాలుగో సెమిస్టర్‌ (రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) (2022–23) పరీక్షల ఫీజు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆగస్టు 5వ తేదీ వరకు చెల్లించవచ్చని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ రాధిక తెలి పారు. రూ.250 అపరాధ రుసుముతో ఆగస్టు 8వ తేదీతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని, రెగ్యులర్‌ విద్యార్థులు రూ.1,380 ఫీజు చెల్లించాలని సూచించారు. బ్యాక్‌లాగ్స్‌ రెండు పేపర్ల వరకు రూ.500, రెండు పేపర్లకు పైన రూ.950, ఇంప్రూవ్‌మెంట్‌ ప్రతీ పేపర్‌కు రూ.300ల చొప్పు న ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లో విద్యనభ్యసించి సివిల్‌ సర్వీసెస్‌లో ర్యాంకులు సాధించి న నిట్‌ విద్యార్థులు తమ కళాశాల రుణం తీ ర్చుకునేందుకు క్యాంపస్‌కు సేవ చేయాలని నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ అన్నారు. కా జీపేట నిట్‌లో మంగళవారం సివిల్‌ సర్వీసెస్‌ (యూపీఎస్సీ)–22లో ర్యాంకులు సాధించిన నిట్‌ విద్యార్థులకు నిట్‌ అలుమ్ని అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ హాజరై ర్యాంకర్లను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంటున్న నిట్‌ వరంగల్‌లో విద్యనభ్యసించి, కళాశాలకే గౌరవంగా నిలుస్తూ సివిల్‌ ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. నిట్‌ విద్యార్థులు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌లో రాణిస్తూ రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. నిట్‌కు చెందిన ఆవుల సాయికృష్ణ ఏఐఆర్‌–94వ ర్యాంకు ఐఏఎస్‌, అచ్యుత్‌ అశోక్‌ 190వ ర్యాంకు ఐపీఎస్‌, ఎప్పలపల్లి సుస్మిత 384వ ర్యాంకు, మనోజ్‌ 559వ ర్యాంకు ఐఏఎస్‌, అనురాగ్‌ 524వ ర్యాంకు ఐఆర్‌ఎస్‌, తుమ్మల సాయికృష్ణారెడ్డి 640వ ర్యాంకు ఐఏఎస్‌, అభిజయ్‌ పగారే 844వ ర్యాంకు ఐసీఏఎస్‌లకు ఆన్‌లైన్‌లో సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. యూపీఎస్సీలో 464వ ర్యాంకు సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికై న సమీర్‌రాజను నిట్‌ డైరెక్టర్‌ ఘనంగా సన్మానించి, మెమొంటోతో సత్కరించారు. కార్యక్రమంలో డీన్‌ ఐఆర్‌అండ్‌ఏఏ రామశేషు, నిట్‌ అల్యు మ్ని అసోసియేషన్‌ ప్రొఫెసర్లు వేణువినోద్‌, ఆనంద్‌ కిషోర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
 

#Tags