Jobs In Schools: మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

సూర్యాపేటటౌన్‌ : జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్‌, ఏఎన్‌ఎం పోస్టులకు అర్హత గల జిల్లా మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ కె.అశోక్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Jobs In Schools

అకౌంటెంట్‌ పోస్టుకు డిగ్రీలో బీకామ్‌తో పాటు కంప్యూటర్‌ బేసిక్స్‌ కోర్సులు చేసి ఉండాలని పేర్కొన్నారు. ఏఎన్‌ఎంకు ఇంటర్‌, ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలల్లో ఏఎన్‌ఎం శిక్షణ పొందిన ధ్రువీకరణ పత్రం ఉండాలని తెలిపారు.

TG Teacher Appointment Letter : సీఎం చేతులమీదుగా.. రేపే డీఎస్సీకి ఎంపికైన వారికి అపాంయింట్‌మెంట్‌ లెటర్స్‌

ఈ నెల 8 నుంచి 14వ తేదీ లోగా ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌, ఒక పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో జత చేసి జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల ఎంఈఓ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags