Job opportunities: న్యాయ సేవా సంస్థ డిఫెన్స్ కౌన్సిల్‌లో ఉద్యోగావకాశాలు
ఖమ్మం లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన కొనసాగుతున్న డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావేద్ పాషా తెలిపారు. ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో పాటు అటెండర్ పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన నిర్ణీత కాలానికి నియమించనన్నట్లు పేర్కొన్నారు. నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు నమూనా, ఇతర వివరాలను ఖమ్మం జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో పరిశీలించి ఆసక్తి ఉన్న వారు ఈనెల 26వ తేదీలోగా పోస్ట్ లేదా కొరియర్ ద్వారా దరఖాస్తులు పంపించాలని సూచించారు.
డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంటౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకుల డిగ్రీ కళాశాలలో 2024–25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు విద్యార్థినీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్ తెలిపారు. ఈ సందర్భంగా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఆయన ప్రవేశాల వాల్‌పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. మణుగూరులోని బాలుర డిగ్రీ కళాశాలతో పాటు కొత్తగూడెం, దమ్మపేట, ఖమ్మం బాలికల కళాశాలల్లో చేరేందుకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇంటర్‌లో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం రీజినల్ కోఆర్డినేటర్ తుమికి వెంకటేశ్వరరాజు, ఏఓ నరేందర్‌తో పాటు కృష్ణ, స్వప్న, రాజేశ్వరి, రోజా, మానస తదితరులు పాల్గొన్నారు.