Engineering Colleges : ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల‌కు వ‌ర్సిటీ అక‌డ‌మిక్ స్టాండింగ్ కౌన్సెల్‌ ఆమోదం.. 8 కాలేజీల‌కు మాత్రం!

వర్సిటీ అకడమిక్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌లో నూత‌న విద్యా సంవ‌త్స‌రానికి ప‌లు ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల‌ను ఆమోదించారు..

అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో 2024–25 విద్యా సంవత్సరంలో 66 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతి లభించింది. రెండు ఇంజినీరింగ్‌ కళాశాలలు కొత్తగా మంజూరయ్యాయి. ఈ మేరకు బుధవారం వర్సిటీ అకడమిక్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌లో ఆమోదించారు. జేఎన్‌టీయూ పరిధిలో మొత్తం 43 వేల ఇంజినీరింగ్‌ సీట్లు ఉన్నాయి. వీటితో పాటు అదనంగా 4 వేల కంప్యూటర్‌ సైన్సెస్‌ బ్రాంచ్‌ సీట్లు అందుబాటులోకి తెచ్చారు. కోర్‌ బ్రాంచుల్లో సగం సీట్లు కూడా భర్తీ అయ్యే పరిస్థితి లేదని, కంప్యూటర్‌ సైన్సెస్‌ సీట్లు అదనంగా కావాలని కోరడంతో ఈ మేరకు అనుమతి ఇచ్చారు. ఇంజినీరింగ్‌ బ్రాంచుల్లో సీట్ల పరిమితిపై ఉన్న ఆంక్షలను ఇప్పటికే ఏఐసీటీఈ ఎత్తివేయడంతో ఇదే అదునుగా కళాశాల యాజమాన్యాలు ఎక్కువ సీట్లు కావాలని కోరినట్లు తెలిసింది.

DSC Free Coaching : టెట్ అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు డీఎస్సీ ప‌రీక్ష‌కు ఉచిత శిక్ష‌ణ‌..

8 ఇంజినీరింగ్‌ కళాశాలలకు షాక్‌..

ఇక.. వర్సిటీ పరిధిలోని 8 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్ల కోత విధించారు. ఇందులో అనంతపురంలోనే రెండు కళాశాలలు ఉండడం గమనార్హం. వాస్తవానికి ఈ 8 కళాశాలల అనుమతిని గతంలో రద్దు చేశారు. అయితే ఆయా కళాశాలల యాజమాన్యాలు వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకురావడంతో సీట్ల కోత విధించి అనుబంధ హోదా మంజూరు చేసినట్లు తెలిసింది. అనంతపురంలో రెండింటితో పాటు చిత్తూరు జిల్లాలో ఒకటి, నెల్లూరు జిల్లాలో రెండు, వైఎస్సార్‌ జిల్లాలో ఒకటి, అన్నమయ్య జిల్లాలో రెండు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇదిలా ఉండగా, నాలుగు ఇంజినీరింగ్‌ కళాశాలలు తమకు అనుబంధ హోదా వద్దని అడ్మిషన్లకు అనుమతి తీసుకోలేదు. ఈ మేరకు సీట్లను ఏపీ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

RGUKT Basar UG Phase I Selection List: బాసర ట్రిపుల్‌ ఐటీలో సీట్ల కేటాయింపు.. ఎంపికైన విద్యార్థుల జాబితా ఇదే..

#Tags