ITI Admissions 2024: ఐటీఐ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ ఎప్పుడంటే..

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్లకు ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కన్వీనర్‌ రవీంద్రరెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులు జూన్‌ 10వ తేదీ లోపు www.iti.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు. వివరాలకు 7799933370, 949362 9036 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

#Tags