Summer Sports Training: వేసవి క్రీడా శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం

మెదక్‌ కలెక్టరేట్‌: మే 1వ తేదీ నుంచి 31 వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజు ఏప్రిల్ 15న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి, అర్హత గల పీడీ, పీఈటీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలి పారు. గ్రామీణ ప్రాంతంలో స్థానికంగా ఉండి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించగలిగే ఆసక్తి గల వారు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

చదవండి: Archery Competitions: జిల్లా స్థాయిలో ఆర్చరీ పోటీలు..

ఏప్రిల్ 18వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా కలెక్టరేట్‌లోని జిల్లా యువజన క్రీడల కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. మరింత సమాచారం కోసం 9347344440, 9493594388 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

#Tags