Telugu Optional Subject : తెలుగు భాష ఐచ్చిక ప్ర‌య‌త్నాల‌ను విర‌మించాలి.. ఇంట‌ర్‌ విద్యాశాధికారుల డిమాండ్..

పుట్టపర్తి టౌన్‌: ఇంటర్మీడియెట్‌లో తెలుగును ఐచ్ఛికం (ఆప్షనల్‌) చేస్తే తెలుగుభాష ఉనికి ప్రశ్నార్థకమవుతుందని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్‌ మూల్యాంకనం కోసం వచ్చిన అధ్యాపకులు బుధవారం కొత్త చెరువు జూనియర్‌ కళాశాల ఎదుట నిరసనకు దిగారు. అనంతరం జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘునాథరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటర్మీడియెట్‌లో ద్వితీయ భాష తెలుగును ఐచ్ఛిక సబెక్టుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు నూరుల్లా, శంకరప్ప, పెద్దన్న, బయపరెడ్డి, నాగరత్నమ్మ, లలిత, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags