BED Colleges: బీఈడీ కళాశాలల్లో తనిఖీలు ప్రారంభం

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలోని బీఈ డీ కళాశాలల తనిఖీలు ఏప్రిల్ 18న‌ ప్రారంభించారు.

ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ఆజాన్‌(భిక్కనూర్‌), కర్షక్‌(కామారెడ్డి), ఎస్‌వీ, ప్రగతి (బాన్సువాడ), సద్గురు బండాయప్ప(బిచ్కుంద), నిజామాబాద్‌ జిల్లాలోని కాటిపల్లి రవీందర్‌రెడ్డి(నిజామాబాద్‌), అయేషా(నిజామాబాద్‌, మల్లారం) కాలేజీల్లో తనిఖీ లు చేశారు.

ఆయా కళాశాలల్లో ఎన్‌సీఈటీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌) నిబంధనల ప్రకా రం ఉండాల్సిన వసతులు, సౌకర్యాలు, టీచింగ్‌ ఫ్యాకల్టీ వివరాలను పరిశీలించారు. 100 మందికి 16 మంది టీచర్లు ఉండాల్సి ఉండగా రికార్డుల్లో అన్ని కళాశాలల వారు టీచింగ్‌ ఫ్యాకల్టీని సక్రమంగానే చూయించారు.

చదవండి: BED Colleges: బీఈడీ కళాశాలలపై కొరడా!

బాన్సువాడ ఎస్‌వీ బీఈడీ కళాశాల సొంత భవనంలో నిర్వహించడం లేదని ఫిర్యాదు వచ్చినట్లు చంద్రశేఖర్‌ తెలిపారు. దీనిపై కళాశాల ఇచ్చిన డాక్యుమెంట్స్‌ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

గతేడాది నిబంధనల మేరకు లేని బీఈడీ కళాశాలలకు తెయూ ఆడిట్‌ సెల్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయా కళాశాలల నిర్వాహకులు ఎన్‌సీఈటీ ద్వారా పొందిన అనుమతి లేఖలను ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌కు అందించారు. లేఖలు నిజమా కాదా అనే విషయమై వర్సిటీ అధికారులు నిర్ధారణ చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
 

#Tags