High School: భారతీయ సంస్కృతికి ఇంగ్లాండ్‌ జాగ్రఫీ విద్యార్థులు ఫిదా

ఐలవరం(భట్టిప్రోలు): భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వంను తెలియచేసే ఓ వినూత్న కార్యక్రమాన్ని భట్టిప్రోలు మండలం ఐలవరం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులు మంగళవారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఇంగ్లాండ్‌లోని సౌత్‌ బ్యాంక్‌ యూనివర్సిటీలో ఉపాధ్యాయ విద్యార్థులకు జాగ్రఫీని బోధించే ఎమిలీ రాబెల్‌ జూమ్‌ ద్వారా వీక్షించారు. ఆమె మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పాశ్చాత్య దేశాలకు మార్గదర్శకంగా ఉంటాయని అంతే కాక ఎంతో ప్రత్యేకత సంతరించుకుందని పేర్కొన్నారు. గత కొద్ది కాలంగా ఆమె యూనివర్సిటీలోని విద్యార్థులకు ఐలవరం హైస్కూల్‌ విద్యార్థులకు ఉత్తర ప్రత్యుత్తరాలు (పెన్‌పాల్‌) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంగ్ల ఉపాధ్యాయులు పచ్చారు హరికృష్ణను ఎమిలీ రాబెల్‌ అభినందించారు.

గురుకుల ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
గుంటూరుఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ ఈఐఎస్‌) ఆధ్వర్యంలో నడుపుతున్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఈనెల 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ గుంటూరు జిల్లా కన్వీనర్‌ జె.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతితోపాటు జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశం పొందేందుకు తాడికొండ, గుంటూరులోని మైనార్టీ బాల, బాలికలు ఏపీఆర్‌ఎస్‌. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనార్టీ విద్యార్థులు నేరుగా ఆయా కళాశాలలు, పాఠశాలల్లో ప్రవేశం పొందవచ్చన్నారు.
 

#Tags