Infosys Employees: ఇన్ఫోసిస్‌లో రూ.కోటి పైగా జీతం.. ఈసారి ఎంత మందికంటే..?

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ఏడాదికి రూ.కోటికి పైగా జీతం తీసుకునే వారి సంఖ్య ఈ ఏడాది తగ్గింది. కనీసం రూ.1.02 కోట్ల వార్షిక వేతనంతో ఇన్ఫోసిస్ లో ఉద్యోగుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం క్షీణించి 103కు పడిపోయిందని సీఎన్‌బీసీ-టీవి 18 గణాంకాలు చెబుతున్నాయి. ఈ 103 మంది ఉద్యోగులు మొత్తంగా ఏడాదికి రూ.176 కోట్ల స్థూల వేతనాన్ని అందుకున్నారు.

ఈ టెక్ దిగ్గజంలో సుమారు 124 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .221 కోట్ల వేతనం పొందారు. రూ. కోటికి పైగా వేతనం పొందే ఉద్యోగుల సంఖ్య 2022 ఆర్థిక సంవత్సరంలో 100 మార్కును దాటగా, 2023 ఆర్థిక సంవత్సరంలో కూడా 124 మంది ఉద్యోగుల సంఖ్యతో అదే స్థాయిలో ఉంది. ఈ జాబితాలో భారత్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇందులో కంపెనీ టాప్ 10 ఉద్యోగులు తీసుకున్న వేతన పరిహారాన్ని చేర్చలేదు.

IBPS Clerk Recruitment: గ్రామీణ బ్యాంకులో క్లర్క్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల

ఇన్ఫోసిస్‌కు ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ లలో నర్సింహారావు మన్నెపల్లి, రిచర్డ్ లోబో, శ్వేతా అరోరా, విశాల్ సాల్వి తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ 103 మంది ఉద్యోగుల్లో మూడింట ఒక వంతు మంది 2000 సంవత్సరం కంటే ముందే ఇన్ఫోసిస్ లో చేరారు. వీరు ఏడాదికి సగటున రూ.1.7 కోట్ల వేతనం తీసుకున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కీ మేనేజిరియల్ పర్సనల్‌ సహా పురుష ఉద్యోగులందరి సగటు వేతనం రూ .11 లక్షలుగా ఉంది. అదే విధంగా మహిళా ఉద్యోగులు సగటున రూ .7 లక్షలు వార్షిక వేతనం పొందారు. కాగా ఏడాది మధ్యలో 34 మంది ఉద్యోగులను నియమించుకోగా వీరి సగటు వేతనం నెలకు 8.5 లక్షలు.

2024 ఆర్థిక సంవత్సరంలో అధిక చెల్లింపులు అందుకున్న ఉద్యోగులలో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) పదవికి రాజీనామా చేసిన నీలాంజన్ రాయ్ రూ .10.7 కోట్ల వార్షిక వేతనంతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కొత్తగా నియమితులైన సీఎపఫ్‌వో జయేశ్ సంఘ్ రాజ్కా రూ.6.1 కోట్లు, దినేష్ ఆర్, సతీష్ హెచ్ సీలు వరుసగా రూ.4.6 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు వేతనం అందుకున్నారు. దినేష్, సతీష్ ఇద్దరూ ఇన్ఫోసిస్ లో ఈవీపీ అండ్ కో-హెడ్ ఆఫ్ డెలివరీగా నియమితులయ్యారు.

#Tags