Gurukul School Students : శ్రేష్ఠ ప‌రీక్ష‌ల్లో గురుకుల విద్యార్థుల స‌త్తా.. పాఠ‌శాల స్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థి!

తాడేపల్లిగూడెం రూరల్‌: దేశ వ్యాప్తంగా నిర్వహించే శ్రేష్ఠ పరీక్షలో మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల‌యానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఈ పరీక్షకు 139 మంది విద్యార్థులు హాజరు కాగా, వారంతా ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపల్‌ బి.రాజారావు ఆదివారం తెలిపారు. పాఠశాల స్థాయిలో సిలరపు హర్షవర్ధన్‌ 895వ ర్యాంకు సాధించాడన్నారు. మూడు వేల లోపు 40 మంది, నాలుగు వేల లోపు 75 మంది ర్యాంకులు సాధించినట్లు వివరించారు. వీరిలో 50 మందికి దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రైవేట్‌, సీబీఎస్‌ఈ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో ఉచిత విద్య, వసతి కల్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఏపీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి మహేష్‌కుమార్‌, డీసీవో భారతిలు అభినందించినట్లు ప్రిన్సిపల్‌ బి.రాజారావు తెలిపారు.

Govt Schools Admissions : ప్ర‌భుత్వ బ‌డుల్లో ప్ర‌వేశాల‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు.. నూరు శాతం ఎన్రోల్మెంట్‌కు కృషి!

#Tags