Schools Inspection : ప్ర‌భుత్వ‌, ఎయిడెడ్ పాఠ‌శాల‌ల త‌నిఖీ..

చీరాల అర్బన్‌: పట్టణంలోని పలు ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్ని పాఠశాల విద్య ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి శుక్రవారం పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన ఈపూరుపాలెంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌, చీరాలలోని జేమ్స్‌ హైస్కూల్‌, ఎన్‌ఆర్‌పీఎం హైస్కూల్‌ను తనిఖీ చేశారు.

Paris Olympics : ఎస్ఆర్ఎం విశ్వ‌విద్యాల‌యం విద్యార్థిని పారిస్ ఒలంపిక్స్‌కు ఎంపిక‌..

తరగతి గదులు, విద్యార్థుల హాజరుశాతాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ప్రతిభా సామర్థ్యాల్ని తెలుసుకున్నారు. అనంతరం బోధనా నైపుణ్యాలపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంఈవో పి.సుబ్రమణ్యేశ్వరరావు ఉన్నారు.

#Tags