Google Layoffs 2024: ఉద్యోగులకు గట్టి షాక్‌ ఇవ్వనున్న గూగుల్‌.. భారీగా లేఆఫ్స్

టెక్ రంగంలో మళ్ళీ లేఆప్స్ అలజడి మొదలైంది. ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం 'గూగుల్'.. ఇప్పుడు మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్దమైంది. ఈ ప్రభావం మేనేజర్ స్థాయి ఉద్యోగులపైన, డైరెక్టర్లపైన, వైస్ ప్రెసిడెంట్ల మీదా పడనుంది. ఈ విషయాన్ని సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.
Google Layoffs 2024

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో నెలకొన్న పోటీని ఎదుర్కోవడానికి, ఓపెన్ఏఐ వంటి వాటిని గట్టి పోటీ ఇవ్వడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Artificial Intelligence Training: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ.. పూర్తి వివరాలివే!

గూగుల్ కంపెనీ 20 శాతం మరింత శక్తివంతంగా మారాలని సుందర్ పిచాయ్ 2022లోనే ఆకాక్షించారు. ఆ తరువాత ఏడాది 12,000 మంది ఉద్యోగులను గూగుల్ తొలగించారు. కాగా ఇప్పుడు 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత మందిని తొలగిస్తారు అనే విషయాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

US Embassy Announces Recruitment: 'యూఎస్ ఎంబసీ రిక్రూట్‌మెంట్‌' ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం..

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags