AP United Teachers Federation : ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవం వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఏలూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు.

ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఏలూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లోని డీసీఎంఎస్‌ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించిన జిల్లా ప్రథమ మహాసభలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవడం ఉపాధ్యాయులందరి బాధ్యత అని, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు విద్యారంగాన్ని పక్కదారి పట్టిస్తున్నాయని దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

AP 10th Class Exam Fee 2025: ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఇదే..

కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ప్రారంభ సమావేశం, యూటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు శ్యాంబాబు అధ్యక్షతన విద్యా సదస్సు, యుటీఎఫ్‌ అధ్యక్షుడు షేక్‌ ముస్తఫా ఆలీ అధ్యక్షతన ప్రతినిధుల సభ నిర్వహించారు. యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్షి రవికుమార్‌ మాట్లాడుతూ 117 జీవోని రద్దు చేస్తానని మాట ఇచ్చిన కొత్త ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి, యూటీఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షుడు ఎన్‌.కుసుమ కుమారి, రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, పశ్చిమగోదావరి జిల్లా ఏపీ జేఏసీ చైర్మన్‌ చోడగిరి శ్రీనివాసరావు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి డీఎన్వీడి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags