Yoga Classes: వేసవిలో ఉచితంగా యోగా శిక్షణ..

యోగాలో ఉచిత శిక్షణ తరగతులు ఒక నెలరోజుపాటు జరుగుతాయని అమరావతి యోగా అండ్‌ ఏరోబిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. అందుకోసం తేదీ, సమయాన్ని వెల్లడించారు..

మొగల్రాజపురం: నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో ఆవరణలోని తమ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి నెల రోజుల పాటు యోగాలో ఉచిత శిక్షణ తరగతులు జరుగుతాయని అమరావతి యోగా అండ్‌ ఏరోబిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పి.వి.రమణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Govt Schools: పాఠశాలల్లో మౌలిక వసతులు

స్టేడియం ఆవరణలోనే రోజూ ఉదయం 5.45 నుంచి 6.45 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. యోగ సాధన వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని సూచించారు. ఆసక్తిగలవారు ఈ 22వ తేదీలోగా శ్రీనివాస్‌ (80082 34545), రాజు (90147 46719), సుబ్రహ్మణ్యం (96668 66986)ను సంప్రదించి పేర్లు నమోదుచేసుకోవాలని కోరారు.

VITEEE 2024: విట్‌ ఈఈఈ 2024 ప్రవేశ పరీక్షలు ప్రారంభం .. ఫలితాలు ఈ తేదీ!

#Tags