Free Training: నిరుద్యోగ యువతకు ఉచితంగా ఉపాధి కోర్సులలో శిక్షణ
సాక్షి,ఆమదాలవలస: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి కోర్సులు నేర్పించనున్నట్లు నైపుణ్య అభివృద్ధి అధికారి సాయికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఫీల్డ్ టెక్నీషియన్ అండ్ ఎయిర్ కండిషనర్ (ఏసీ టెక్నీషియన్) కోర్సుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. టెన్త్ క్లాస్, డిగ్రీ, బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులని, 18 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన యువకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కోర్సుకు 6 నెలల పాటు ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం 7569077449 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags