Free Skill Development Training: సీపెట్‌లో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పన

గుంటూరు ఎడ్యుకేషన్‌: విజయవాడలోని కేంద్ర పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌)లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో కూడిన ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ) సహకారంతో టెన్త్‌లో ఉత్తీర్ణులైన 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగిన నిరుద్యోగ యువతకు పాలిమర్స్‌ టెక్నాలజీలో మెషీన్‌ ఆపరేటర్‌ అసిస్టెంట్‌ – ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ కోర్సులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ కల్పించి, సర్టిఫికెట్‌ అందజేస్తామని వివరించారు. శిక్షణానంతరం అనంతపురం, హైదరాబాద్‌ బెంగళూరు, హోసూరు, చైన్నె తదితర ప్రాంతాల్లోని ప్రముఖ ప్లాస్టిక్‌, అనుబంధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు, ట్రైనింగ్‌ కిట్‌, యూనిఫాం, సేఫ్టీ షూస్‌ను సీపెట్‌ అందజేస్తుందని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు, ఆదాయ, సామాజిక వర్గ ధ్రువపత్రాలతో పాటు ఆధార్‌, రేషన్‌కార్డు, నాలుగు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో తమ ప్రతినిధి బాణావతు అంజినాయక్‌ను 78935 86494 నంబర్‌లో సంప్రదించి, సత్వరమే రిజి స్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు.

చ‌ద‌వండి: Group 2 Free Coaching: గ్రూప్‌–2కు ఉచిత శిక్షణ

#Tags