Self Employment for Women: మహిళలకు స్వయం ఉపాధి సంస్థ అందిస్తున్న ఉచిత శిక్షణ.. వివరాలు..
డిచ్‌పల్లి: డిచ్‌పల్లిలోని స్టేట్ బ్యాంక్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్ధ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 17 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. బ్యూటీపార్లర్, మగ్గంవర్క్, టైలరింగ్ (30 రోజులు) కోర్సుల్లో శిక్షణ ఇస్తారని వివరించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల గ్రామీణ ప్రాంత యువతులు 19 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు.
After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!
ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్, రేషన్‌కార్డు, ఎస్సెస్సీ మెమో, 5 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తీసుకుని, ఆర్‌ఎస్‌ఈటీఐలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ధ్రువీకరణపత్రం, టూల్ కిట్ అందజేస్తామని, ఈ అవకాశాన్ని ఆసక్తి, అర్హత గల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ కోరారు. పూర్తి వివరాలకు 08461 295428 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Summer Sports Training: వేసవి క్రీడా శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం