Fake Certificates : నల్లమలలో ఫేక్ బోనోఫైడ్‌తో ఉద్యోగాలకు ఎసరు
సాక్షి ఎడ్యుకేషన్: ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులు పొందిన వారిపై లోకల్, నాన్ లోకల్ ఫిర్యాదులతో ఈ బండారం బయట పడింది. ఈ వ్యవహారంలో పదర మండలం చింట్లకుంటకు చెందిన ఓ ఉపాధ్యాయుడు జీఓ 317లో నారాయణపేట జిల్లాకు వెళ్లగా.. డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌కు వెళ్లారు. ఇతనే నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
Students Debarred: డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 13 మంది డిబార్
గతంలో అచ్చంపేటలో టెట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు వచ్చిన వార్తలో ఈ వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదువుకుంటే అదే లోకల్ అవుతుంది. కొందరు టీజీపీఎస్ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో నాగర్‌కర్నూల్ జిల్లాను లోకల్‌గా చూయించి.. డీఎస్సీలో మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను లోకల్‌గా పరిగణలోకి తీసుకొని ఉద్యోగం పొందారు.
దీనిపై ఆ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై టీజీపీఎస్ ఆధార్ నంబర్ల ఆధారంగా విచారణ మొదలుపెట్టింది. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌కు విచారణ నిమిత్తం వచ్చిన అక్కడి అధికారులు ఈ ప్రాంతంలోని పాఠశాలల్లో రికార్డులను పరిశీలించగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
జిల్లాలో నాన్ లోకల్‌కు ఉద్యోగాలు..
ఇటీవలి డీఎస్సీలో ఎంపికైన వారు కూడా లోకల్ నకిలీ బోనోఫైడ్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం పొందినట్లు తెలుస్తోంది. స్థానికేతరుడు వచ్చి ఉద్యోగం పొందడంతో స్థానికుడైన లింగాల మండలం అప్పాయిపల్లికి చెందిన గోపాల కృష్ణయ్య కోర్టుకు వెళ్లారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల స్థానికేతరులు ఉద్యోగాలు పొందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా నుంచి ఎంపికైన ఓ ఉపాధ్యాయుడు 1 నుంచి 3వ తరగతి వరకు పెంట్లవెల్లి పాఠశాలలో, 3 నుంచి 5 వరకు వనపర్తి జిల్లాలో చదివినట్లు బోనోఫైడ్ సర్టిఫికెట్లు పెట్టారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో విద్యాశాఖ అధికారులు రిజెక్ట్, నాన్ లోకల్ అని రాశారు. అలాంటి వ్యక్తికి ఉద్యోగం రావడంపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.
Anganwadi Jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
అచ్చంపేట నియోజకవర్గంలో నకిలీ సర్టిఫికెట్లతో సుమారు 20 మంది వరకు ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. అచ్చంపేట మండలంలో ముగ్గురు, బల్మూర్ మండలంలో ఇద్దరు, అమ్రాబాద్, పదర మండలంలో ఐదుగురిపై ఇటీవల కాలంలో విచారణ కొనసాగింది. అచ్చంపేట మండలం ఆంజనేయతండా, మరో రెండు గ్రామాలకు చెందిన వారిపై విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టగా.. ఇద్దరు వ్యక్తులు ఈ ప్రాంతంలో చదువుకోలేదని తేలింది. హైదరాబాద్‌లో ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన ఓ వ్యక్తి 5 నుంచి 9వ తరగతి వరకు అచ్చంపేట ఆశ్రమ పాఠశాలలో చదువుకోగా.. అంతకు ముందు ఇక్కడ చదవలేదని గుర్తించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
అయితే జీఓ 317లో వెళ్లిపోయిన ఉపాధ్యాయుడు ఉదయం ఎవరూ లేని సమయంలో ఆశ్రమ పాఠశాలకు వెళ్లి అటెండర్ ఎల్లయ్య సహాయంతో నేను ఇక్కడే చదివాను.. పుట్టిన తేదీ సక్రమంగా ఉందో లేదో చూస్తానని చెప్పి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని రికార్డు తీసుకుని ఒక వ్యక్తి సంబంధించిన విద్యాభ్యాసం రిజిష్టర్‌లో నమోదు చేశారు. 1 నుంచి 4వ తరగతి హైదరాబాద్ న్యూ అరిజాన్ స్కూల్‌లో చదివినట్లు పీవీసీ స్టడీ డీటేల్స్ కాలమ్‌లో రాయకుండా ఇతర కాలమ్‌లో 317 అడ్మిషన్ నంబరు తప్పుగా రాసినట్లు గుర్తించారు.
10th class and intermediate exams Dates: AP 10వ తరగతి , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
అయితే రికార్డు కరెప్సెన్ కంటే ముందే టీజీపీఎస్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న జ్యోతి ఆశ్రమ స్కూల్ ఏసీఎంఓ తిరుపతయ్య ద్వారా రికార్డు ఫొటోలు తెప్పించుకోవడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సదరు ఉపాధ్యాయుడిపై అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు పెట్టారు. అలాగే బల్మూర్ మండలం తుమ్మన్‌పేట యూపీఎస్, బల్మూర్ కేజీబీవీలో చదివిన మరో ఇద్దరు, పదర మండలంలో ముగ్గురు హైదరాబాద్ లోకల్‌గా చూపి ఉద్యోగం పొందినట్లు విద్యాశాఖ విచారణలో తేలింది.