Evening Courses: శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలలో సాయంత్రం కోర్సులకు దరఖాస్తులు

తిరుపతి(అలిపిరి): శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలలో సాయంత్రం కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సంప్రదాయ కలంకారీ కళ, శిల్పకళల్లో ప్రాథమిక అంశాలు అనే కోర్సులను నూతనంగా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 31వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తులను కళాశాలలో సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, గరిష్ట వయోపరిమితి లేదని వెల్లడించారు. వివరాలకు 0877–2264637, 986699 7290 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

చ‌ద‌వండి: Mega Job Mela: రేపు వైఎస్సార్‌ మెగా జాబ్‌ మేళా.. 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు

#Tags