Entrance Exam for Gurukul Admissions : 27న బాలిక‌ల గురుకుల ప్ర‌వేశానికి ప‌రీక్ష‌.. ఈ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కే

తుని రూరల్‌: మండలంలోని వి.కొత్తూరులో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల బాలికల పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ నిర్మల కుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులకు బుధవారం వరకూ అవకాశం ఉందని, 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10 గంటలకు ఆధార్‌ కార్డు నకలు, పాస్‌పోర్టు సైజు ఫొటోతో రావాలన్నారు.

AP DSC Posts : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే డీఎస్సీ పోస్టులకు ప్రకటన

ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకూ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామన్నారు. ఆరో తరగతిలో ఎస్టీ 3, బీసీ–సీ 2, బీసీ 1, ఓసీ 1 చొప్పున ఖాళీలున్నాయని తెలిపారు. ఏడో తరగతిలో ఎస్టీ 1, బీసీ 2, ఓసీ 1, ఎనిమిదో తరగతిలో ఎస్టీ 2, తొ మ్మిదో తరగతిలో ఎస్టీ 1 చొప్పున ఖాళీలు న్నాయని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ప్రవేశ పరీక్షకు సకాలంలో హాజరు కావాలని నిర్మల కుమారి కోరారు.

Campus Recruitment Drive: ఐటీఐ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఈనెల 28న క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌

#Tags