Environmental Protection Awards: ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డులు.. ద‌ర‌ఖాస్తుల‌కు అర్హులు వీరే!

వ‌చ్చే నెల నిర్వ‌హించ‌నున్న ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ అవార్డుల‌ను అందుకునేందుకు అర్హులన్న‌వారు ప్ర‌క‌టించిన విధంగా ద‌ర‌ఖాస్తులు చేసుకొని అందించాలి. అర్హులు వీరే..

చుంచుపల్లి: జూన్‌ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పర్యావరణ ఇంజనీర్‌ బి.రవీందర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్‌పై నిషేధం, నీటి పొదుపు, వాయు కాలుష్య నియంత్రణ, వ్యర్థ పదార్థాల నిర్వహణలో విశేష కృషి చేస్తున్న సంస్థలు, పరిశ్రమలు, ఆస్పత్రులు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, స్వయం సహాయక బృందాలు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలకు, పర్యావరణ దినోత్సవం రోజున అవార్డులు అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తులను పర్యావరణ విద్యా విభాగం, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ఎ–3 ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, పర్యావరణ భవన్‌, సనత్‌ నగర్‌, హైదరాబాద్‌–18 చిరునామాకు ఈనెల 15వ తేదీలోగా అందించాలని కోరారు.

TS TET: టెట్‌పై నిర్ణయాధికారం పాఠశాల విద్య కమిషనర్‌కు ఉండదు: టీఎస్‌పీటీఏ

#Tags